అన్ లిమిటెడ్ ఇంటర్నెట్... పో*ర్న్ సినిమాలతో కిమ్ సైన్యం బిజీ బిజీ!
ఉక్రెయిన్ తో యుద్ధంలో సహాయ సహకారాల కోసం రష్యా వెళ్లిన ఉత్తర కొరియా సైన్యానికి ఉన్నపలంగా స్వేచ్ఛ దొరికిన ఫీలింగ్ వస్తోందంట
By: Tupaki Desk | 8 Nov 2024 3:37 AM GMTఎన్నో కఠినమైన నిబంధనలు, వేసుకునే దుస్తుల నుంచి దువ్వుకునే జుట్టువరకూ.. రేడియోలో వినే కార్యక్రమాల నుంచి టీవీలో చూసే ప్రోగ్రామ్స్ వరకూ.. ఇక పరిమితులతో కూడిన ఇంటర్నెట్, ఏమాత్రం పరిచయం లేని సోషల్ మీడియా.. ఇలా ఎన్నో కండిషన్స్ మధ్య నియంత కిమ్ అండర్ లో బ్రతుకుతున్న ఉత్తర కొరియా సైన్యం ఇప్పుడు రష్యాలోనూ ఉంది!
ఉక్రెయిన్ తో యుద్ధంలో సహాయ సహకారాల కోసం రష్యా వెళ్లిన ఉత్తర కొరియా సైన్యానికి ఉన్నపలంగా స్వేచ్ఛ దొరికిన ఫీలింగ్ వస్తోందంట. కొత్తగా రెక్కలొచ్చెనా... అన్నట్లుగా వాళ్లు స్వేచ్ఛ ఫీలవుతున్నారని అంటున్నారట. దీనికి తోడు అపరిమితమైన ఇంటర్నెట్ సదుపాయం కూడా అందుబాటులో ఉండటంతో.. సరికొత్త ఆలోచనలు చేస్తున్నారంట.
అవును... ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఇటీవల ఉత్తర కొరియా సైన్యం కూడా చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ఉత్తర కొరియాను వదిలి బయటకు వెళ్లిన కిమ్ సైన్యం అపరిమిత ఇంటర్నెట్ సదుపాయం దొరికిన ఆనందంలో ఉందని.. దీంతో... విచ్చలివిడిగా అశ్లీల చిత్రాలు చూడటం మొదలుపెట్టారని.. బ్రిటన్ వార్తా సంస్థ ఓ కథనంలో పేర్కోంది.
ఉక్రెయిన్ తో యుద్ధం వేళ రష్యా కోసం భారీగా ఆయుధ సామాగ్రిని పంపిస్తోన్న ఉత్తరకొరియా.. ఇటీవల సైనిక సహాయాన్ని కూడ పంపించింది. దీంతో... పెద్ద ఎత్తున కిమ్ సైన్యం.. రష్యాకు వెళ్లింది! ఈ నేపథ్యంలో.. ఉక్రెయిన్ సరిహద్దులకు చేరుకున్న కిమ్ సైన్యానికి అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిందని చెబుతున్నారు.
దీంతో... ఇంత మంచి అవకాశం మళ్లీ వస్తుందో రాదో అని భావించిన కిమ్ సైన్యం... గతంలో ఎన్నడూ ఎరుగని పో*ర్న్ సైట్లను చూడటంలో మునిగిపోయినట్లు ఆ కథనం పేర్కొంది! దీంతో... ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కిమ్ సైన్యానికి కొత్తగా రెక్కలొచ్చాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి!