ఫ్రెండ్ కు లాటరీ తగిలిందని .. కట్ చేస్తే!
నార్త్ కెరొలీనాకు చెందిన మెల్విన్ బ్రూక్స్ స్నేహితుడికి ఇటీవల లాటరీ టికెట్ కొన్నాడు. అతనికి ప్రైజ్ మనీగా రూ.8 వేలు గెలుచుకున్నాడని తెలుసుకున్నాడు.
By: Tupaki Desk | 14 Jun 2024 1:30 AM GMTఅదృష్టదేవత ఎప్పుడు ? ఎక్కడి నుండి ? తలుపు తడుతుందో చెప్పలేం. జీవితంలో మన పని మనం చేసుకుంటూ పోవడమే మన విధి. స్నేహితుడికి లాటరీలో టికెట్ తగిలిందని తెలిసి తనూ ఓ టికెట్ కొనుక్కున్నాడు. అంతనే అతని జీవితం అనూహ్య మలుపు తిరిగింది. లాటరీలో ఏకంగా రూ.33 కోట్లు వచ్చాయి. ఈ దెబ్బతో ఒక్క రాత్రికి జాక్ పాట్ తగిలి జీవితంలో సెటిల్ అయిపోయాడు.
నార్త్ కెరొలీనాకు చెందిన మెల్విన్ బ్రూక్స్ స్నేహితుడికి ఇటీవల లాటరీ టికెట్ కొన్నాడు. అతనికి ప్రైజ్ మనీగా రూ.8 వేలు గెలుచుకున్నాడని తెలుసుకున్నాడు. తనకూ లక్కు తగలకపోతుందా అని మెల్విన్ భారత కరెన్సీలో రూ.400 పెట్టి లాటరీ టికెట్ కొన్నాడు. మెల్విన్ మౌంట్ హాలీలోని ఓ పార్కింగ్ లాట్‌లో తను కొన్న టిక్కెట్‌ను స్క్రాచ్ చేసి చూసి అతడు ఒక్కసారిగా షాకయ్యాడు. లాటరీలో ఏకంగా రూ.33 కోట్లు దక్కడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అన్నిరకాల పన్నులు పోను అతడికి దాదాపు 2.85 లక్షల డాలర్లు చేతికి దక్కాయి. ఇందులో కొంత మొత్తంతో అప్పులు తీర్చేసి మిగతా మొత్తాన్ని భార్య, బిడ్డలతో కలిసి పంచుకుంటానని చెప్పాడు. ఇది అరుదుగా మాత్రమే జరిగే ఘటన అని, ఈ లాటరీ దక్కినందుకు తాను ఎల్లప్పుడూ దేవుడికి రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు మెల్విన్ బ్రూక్స్.