Begin typing your search above and press return to search.

ప్రధాని ఆందోళన... మస్క్ అన్ని చోట్లా వేలు పెడుతున్నారా?

అవును... ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్రంప్ ప్రభుత్వంలో కీ రోల్ పోషించబోతున్నారని అంటున్న వేళ.. పలు దేశాల పాలిటిక్స్ లోనూ ఆయన వేళ్లు, కాళ్లూ పెట్టేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   6 Jan 2025 6:30 PM GMT
ప్రధాని ఆందోళన... మస్క్  అన్ని చోట్లా వేలు పెడుతున్నారా?
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తరుపున ప్రచారం చేస్తూ, పైసలు కూడా వెదజల్లారనే పేరు సంపాదించుకున్నారు ఎలాన్ మస్క్! ఇక అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచీ మస్క్ పొలిటికల్ ఇంట్రస్టులు పెరిగిపోతున్నాయని.. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల రాజకీయాల్లోనూ వేలు పెట్టేస్తున్నారని అంటున్నారు.

అవును... ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్రంప్ ప్రభుత్వంలో కీ రోల్ పోషించబోతున్నారని అంటున్న వేళ.. పలు దేశాల పాలిటిక్స్ లోనూ ఆయన వేళ్లు, కాళ్లూ పెట్టేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే బ్రిటన్ రాజకీయాలపై ట్రంప్ దృష్టి సారించినట్లు కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా... అక్కడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ క్రమంలో బ్రిటన్ లోని ప్రతిపక్షం రీఫాంయూకే కు మద్దతు తెలుపుతూ స్పందించడంతోపాటు.. ఆ పార్టీకి భారీ విరాళం ఇచ్చే యోచనలో కూడా ఎలాన్ మస్క్ ఉన్నారనే చర్చ తెరపైకి వచ్చింది. పైగా.. ఆ పార్టీకి అధినేతగా ఎవరు ఉండాలో కూడా చెప్పుకొచ్చిన మస్క్.. ఆ సామర్ధ్యం జైల్లో ఉన్న బ్రిటీష్ ఆందోళనకారుడు టామీ రాబిన్ సన్ కు ఉందని తెలిపారు.

ఇలా.. వివిధ దేశాల రాజకీయాలో మస్క్ జోక్యం చేసుకోవడంపై నార్వే ప్రధాని జోనాస్ స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. ఎలాన్ మస్క్ అమెరికా వెలుపల ఆయా దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. తన సోషల్ మీడియా నెట్ వర్క్ ని విస్తృతంగా వినియోగించుకునే సౌలభ్యం మస్క్ కు ఉందని అన్నారు.

పైగా మస్క్ దగ్గర భారీ స్థాయిలో ఆర్థిక వనరులు ఉన్నాయని.. అలాంటి వ్యక్తి ఇతర దేశాల రాజకీయాల్లో, అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొవడం ఏమాత్రం మంచిది కాదని చెబుతూ.. జోనాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశ రాజకీయాల్లో మస్క్ జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటే.. అన్ని పక్షాల నాయకులు కలిసి కట్టుగా ఆయన ప్రయత్నాలకు దూరంగా ఉండాలని సూచించారు.