Begin typing your search above and press return to search.

స్టెల్లా నౌకలో మరోసారి తనిఖీలు.. తెరపైకి 'సీజ్ ది రైస్'!

మరోపక్క... ఈ స్టెల్లా నౌకను సీజ్ చేయడం దాదాపు అసాధ్యం అనే క్లారిటీకి అధికారులు వచ్చినట్లు కథనాలొస్తున్నాయి. అడ్మిరలజీ కోర్టులో ఈ విషయం నిలబడే అవకాశం చాలా తక్కువని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   4 Dec 2024 7:27 AM GMT
స్టెల్లా నౌకలో మరోసారి తనిఖీలు.. తెరపైకి సీజ్  ది రైస్!
X

కాకినాడలోని యాంకరేజ్ పోర్టులో రేషన్ బియ్యం నిల్వచేసినట్లు చెబుతున్న స్టెల్లా ఎల్ పనామా నౌక విషయంలో పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయం "సీజ్ ది షిప్" తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో అది సాధ్యం కాదనే కామెంట్లు వినిపిస్తున్న వేళ.. అధికారులు మరోసారి స్టెల్లా నౌకను తనిఖీలు చేపడుతున్నారు!

అవును.. రేషన్ బియ్యం నిల్వ చేశారంటూ స్టెల్లా ఎల్ పనామా నౌకలో మరోసారి తనిఖీలు చేపడుతున్నారు అధికారులు. దీనికోసం కస్టమ్స్, పోర్టు, పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాల అధికారులతో ఓ ప్రత్యేక బృందం సముద్రంలోకి వెళ్లింది. ఈ మల్టీ డిసిప్లీనరీ కమిటీ అక్కడున్న బియ్యం శాంపుల్స్ సేకరించి పరిశీలించనున్నారని అంటున్నారు.

ఈ సందర్భంగా నౌకలో ఉన్న వాటిలో ఎంత మేర రేషన్ బియ్యం ఉన్నాయనేది గుర్తించనున్నారని అంటున్నారు. అయితే... నౌకను సీజ్ చేయడం దాదాపు అసాధ్యం అనే కామెంట్లు వినిపిస్తున్న వేళ.. అందులో ఉన్న రేషన్ బియ్యాన్ని గుర్తించి, దాన్ని మాత్రం సీజ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అనంతరం నౌకను పంపించనున్నారని సమాచారం!

మరోపక్క... ఈ స్టెల్లా నౌకను సీజ్ చేయడం దాదాపు అసాధ్యం అనే క్లారిటీకి అధికారులు వచ్చినట్లు కథనాలొస్తున్నాయి. అడ్మిరలజీ కోర్టులో ఈ విషయం నిలబడే అవకాశం చాలా తక్కువని భావిస్తున్నట్లు చెబుతున్నారు. పైగా... ఇది వేరే దేశానికి చెందిన నౌక కావడంతో.. సీజ్ చేయడం చెప్పినంత సులువు కాదని క్లారిటీకి వచ్చారని అంటున్నారు.

కాగా... ఇటీవల కాకినాడలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన శాఖ పరిధిలోని విషయం కానప్పటికీ.. తుఫాను సమయంలో కూడా ధైర్యంగా సముద్రంలోకి వెళ్లి బియ్యం అక్రమ రవాణా అంటూ నౌకను సీజ్ చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ 'సీజ్ ది షిప్' వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కాగా.. ట్విట్టర్ లోనూ ట్రెడింగ్ లో నిలిచింది.

కాగా... నాడు తుఫాన్ కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో నౌకలోని లోడింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే! 35 వేళ టన్నులకు గానూ మూడు వేల టన్నులే లోడ్ చేశారనే కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు తుఫాన్ ఎఫెక్ట్ లేకపోవడంతో మిగిలిన బియ్యం లోడ్ చేయాలని.. ఆలస్యం అయితే డెమరెజ్ భారం పడనుందని అంటున్నారు!