రామ రామ : రఘురామకు నో టికెట్....!?
ఆ సీటు టీడీపీ ఉంచుకున్నా లేక జనసేన తీసుకున్నా రఘురామ టికెట్ కి ఏ ఢోకా లేకుండా పోయేది.
By: Tupaki Desk | 24 March 2024 3:00 AM GMTవైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజుకు బీజేపీ భారీ హ్యాండ్ ఇచ్చేసింది అని అంటున్నారు. నర్సాపురం సీటు పొత్తులో భాగంగా బీజేపీకి దక్కింది. ఆ సీటు టీడీపీ ఉంచుకున్నా లేక జనసేన తీసుకున్నా రఘురామ టికెట్ కి ఏ ఢోకా లేకుండా పోయేది. కానీ ఆ సీటు బీజేపీకి వెళ్లింది. బీజేపీ అంటే జాతీయ నాయకత్వం అంతా ఎంపిక చేయాల్సి ఉంటుంది.
అక్కడే నిర్ణయాలు ఉంటాయి. తాను బీజేపీ కేంద్ర నాయకత్వానికి బాగా దగ్గర అని ఎంతలా రఘురామ చెప్పుకున్నా చివరికి ఆయనకు మొండి చేయి చూపిస్తున్నారు అని అంటున్నారు. అదే టైం లో ఏపీ బీజేపీలో ఉన్న యాంటీ టీడీపీ బ్యాచ్ లీడర్స్ కూడా ఆయన వద్దు అని కేంద్ర పెద్దలకు చెప్పేశారుట.
ఈ పరిణామాలతో రఘురామ నర్సాపురం బంధానికి పెద్ద బ్రేక్ పడబోతోంది అని అంటున్నారు. ఇక అభ్యర్ధిగా చూసినా రఘురామ 2019లో గెలిచిన తరువాత నాలుగేళ్ళకు పైగా ఢిల్లీలోనే గడిపారు. ఆయనకు నియోజకవర్గం ప్రజలతో సంబంధాలు కూడా లేవు అని అంటున్నారు.
ఇక గెలిచిన పార్టీకి ఢోకా ఇచ్చేసి ఆయన ఎలా ఢిల్లీలో గడిపారో కూడా అంతా చూశారు. అసలు విషయం ఏంటి అంటే బీజేపీ అడగగానే ఈ సీటు ఇచ్చేసి బాబు పవన్ చేతులు దులుపుకున్నారని అంటున్నారు. దాని వెనక రఘురామతో పేచీ ఎందుకు అనే అని అంటున్నారు. ఆయన ఇపుడు బీజేపీ పెద్దలతో తేల్చుకోలేక సతమతం అవుతున్నారని అంటున్నారు.
రఘురామ ప్లేస్ లో కేంద్ర మాజీ మంత్రి దివంగత నటుడు అయిన క్రిష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని నిల్లబెట్టాలని ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. అవిడ అయితే సరైన పోటీ ఉంటుందని, బలమైన నేపధ్యంతో పాటు కొత్త ముఖం ప్రభాస్ బాహుబలి క్రేజ్ ఇవన్నీ కూడా కలసివస్తాయని బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారుట.
ఈ పరిణామాలతో రఘురామ ఆశలు పూర్తిగా నీరు కారుతున్నాయి అంటున్నారు. నిజానికి చూస్తే ఆయనకు బీజేపీ టికెట్ దక్కకపోవడం ఇది మొదటిసారి కాదు అని అంటున్నారు. 2014లో ఆయన ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు ఫలితం దక్కలేదు అని అంటున్నారు. ఏది ఏమైనా రఘురామ తన వంతుగా గట్టి ప్రయత్నాలే చేసుకుంటున్నారు అని అంటున్నారు. మరి ఆయనకు టికెట్ దక్కకపోతే మాజీ ఎంపీగానే ఏ మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది అని అంటున్నారు.