Begin typing your search above and press return to search.

జర్నలిస్ట్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎన్నిక‌లు

రేయింబ‌వ‌ళ్లు త‌మ వృత్తిలో భాగంగా తిండితిప్ప‌లు మాని, కంటిపై స‌రిగా కునుకు అన్న‌దే లేకుండా ప‌ని చేసే జ‌ర్న‌లిస్టు వృత్తి ఒత్తిళ్లమ‌యం అన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 Dec 2024 6:09 AM GMT
జర్నలిస్ట్స్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎన్నిక‌లు
X

రేయింబ‌వ‌ళ్లు త‌మ వృత్తిలో భాగంగా తిండితిప్ప‌లు మాని, కంటిపై స‌రిగా కునుకు అన్న‌దే లేకుండా ప‌ని చేసే జ‌ర్న‌లిస్టు వృత్తి ఒత్తిళ్లమ‌యం అన్న సంగ‌తి తెలిసిందే. దీనికి తోడు జ‌ర్న‌లిస్టుల సంక్షేమం ఇది చేస్తాం అది చేస్తాం! అంటూ క‌నీస అవ‌స‌రాన్ని కూడా గుర్తించ‌కుండా, వారికి స‌హ‌క‌రించ‌ని రాజ‌కీయాలు నేడు న‌డుస్తున్నాయి. అయితే ఇలాంటి దారుణ స‌న్నివేశం నుంచి త‌మ‌ను తాము కాపాడుకునేందుకు, జ‌ర్న‌లిస్టుల సంక్షేమం కోసం కొన్ని అసోసియేష‌న్లు ఏర్ప‌డ్డాయి. ఇదే కేట‌గిరీకి చెందిన‌దే అయినా... సొంత గూడు కోసం ప్ర‌య‌త్నించేందుకు `ది జర్నలిస్ట్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్` ఏర్పడింది. జూబ్లీహిల్స్ (హైద‌రాబాద్) జ‌ర్న‌లిస్టుల కాల‌నీలో ఈ హౌసింగ్ సొసైటీ కార్యాల‌యం ఉంది.

గ‌త కొన్నేళ్లుగా `ది జర్నలిస్ట్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్` ఎన్నిక‌లు నిర్వ‌హించ‌క‌పోవ‌డంపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు ఉన్నాయి. జ‌ర్న‌లిస్టుల్లో అంత‌ర్గ‌త క‌ల‌హాలతో వారికి ద‌క్కాల్సిన ఇళ్ల స్థ‌లాలు కూడా ద‌క్క‌లేదు. ప్ర‌భుత్వాలు సైతం వీళ్ల గొడ‌వ‌లను అడ్డు పెట్టుకుని సంక్షేమానికి గండి కొట్టాయి. ఇక `ది జర్నలిస్ట్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్` లో అలాటీస్.. నాన్ అలాటీస్ అంటూ రెండు గ్రూపులు న‌డుస్తున్నాయి. ఇల్లు కేటాయింపులు జ‌రిగిన జ‌ర్న‌లిస్టులు, కేటాయింపుల్లో లేని జ‌ర్న‌లిస్టులు అంటూ రెండు గ్రూపులున్నాయి. ఇందులో మెజారిటీ వ‌ర్గం నాన్ అలాటీస్ చాలా కాలంగా ఇండ్ల స్థ‌లాల‌ను కేటాయించాల్సిందిగా తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కోరుతున్నారు. కానీ ఇది నీటి మూట చందంగా మారుతోంది.

ఎట్ట‌కేల‌కు జ‌ర్న‌లిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. మేనేజింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ తో పాటు నియ‌మావ‌ళి వివ‌రాల‌ను స‌బ్ రిజిస్ట్రార్ రాజేందర్ రెడ్డి వెలువ‌రించారు. వాటి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ఎన్నిక‌ల్లో ఏ స్థానం ఎవ‌రికి?

డైరెక్టర్ స్థానాలు : 09(తొమ్మిది)

రిజర్వేషన్ వివరాలు

ఎస్సీ / ఎస్టీ : 01 ( ఒకటి)

మహిళలు : 02 (రెండు)

జనరల్ : 06 (ఆరు)

(SC/ST/BC/OC/Women)

పోలింగ్ తేది: 18, డిసెంబరు 2024

నామినేషన్ల స్వీకరణ: మూడు పనిరోజులు

డిసెంబరు 07, 09, 10తేదీలు

పరిశీలన: డిసెంబరు 11

ఉపసంహరణ: డిసెంబరు 12

ఫైనల్ జాబితా ప్రకటన: డిసెంబరు 12

*నామినేషన్ దాఖలాకు ఇదీ నియమావళి:

అభ్యర్థికి సంబంధించిన

సొసైటీ గుర్తింపుకార్డు,

ఆధార్ కార్డు,

రెండు పాసుపోర్టుసైజు ఫోటోలు

అభ్యర్థిత్వాన్ని బలపరచేందుకు

ప్రతిపాదకులు, ఇద్దరు సంతకాలు చేయాలి

వాళ్లుకూడా సొసైటీ గుర్తింపుకార్డు,

ఆధార్ కార్డు జిరాక్సు కాపీలు జతచేయాలి.

నిర్ణీత నామినేషన్ ఫీజు చెల్లించాలి.

*నామినేషన్ దాఖలాకు ఇదీ నియమావళి

అభ్యర్థికి సంబంధించిన

సొసైటీ గుర్తింపుకార్డు,

ఆధార్ కార్డు,

రెండు పాసుపోర్టుసైజు ఫోటోలు

అభ్యర్థిత్వాన్ని బలపరచేందుకు

ప్రతిపాదకులు ఇద్దరు సంతకాలు చేయాలి

వాళ్లు కూడా సొసైటీ బి గుర్తింపు కార్డు,

ఆధార్ కార్డు జిరాక్సు కాపీలు జతచేయాలి.

నిర్ణీత నామినేషన్ ఫీజు చెల్లించాలి.