Begin typing your search above and press return to search.

బాబా మజాకానా....ఎల్జీ పాలిమర్స్ లో ఎంత మార్పు ?

ఈ సంఘటన తరువాత ఎల్జీ పాలిమర్స్ నుంచి అనుకున్న స్థాయిలో నష్ట పరిహారం అందలేదు.

By:  Tupaki Desk   |   12 July 2024 4:30 AM GMT
బాబా మజాకానా....ఎల్జీ పాలిమర్స్ లో ఎంత మార్పు ?
X

అందరికీ ఒక దుర్ఘటన గుర్తుండే ఉంటుంది. ఇప్పటికి నాలుగేళ్ల క్రితం 2020 మే నెలలో కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న వేళ విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయి ఎంతో మంది అమాయకులు బలి అయ్యారు. ఈ సంఘటన తరువాత ఎల్జీ పాలిమర్స్ నుంచి అనుకున్న స్థాయిలో నష్ట పరిహారం అందలేదు.

అయితే ఇపుడు చూస్తే అదనంగా మరి కొంత నష్టపరిహారం చెల్లించేందుకు సంస్థ ముందుకు రావడం విశేషం. ఇది చంద్రబాబు సీఎం అయిన తరువాత పాలిమర్స్ లో వచ్చిన మార్పుగానే చూస్తున్నారు. అంతే కాదు ఈ సంస్థను విశాఖ నుంచి తరలించి శ్రీ సిటీలో నిర్వహించేందుకు కూడా అనుమతులు కోరారు. అదే విధంగా విశాఖలో పర్యావరణానికి అనుకూలించే విధంగా అక్కడ ఉత్పత్తులు తయారు చేస్తామని కూడా సంస్థ అంటోంది.

మొత్తానికి ఇది మంచి పరిణామంగా చూస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ సంస్థ వల్ల 12 మంది అకాల మృత్యువాత పడ్డారు. మరెంతో మంది అనారోగ్యం పాలు అయ్యారు. ఈ రోజుకీ బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. గత ప్రభుత్వంలో వారిని అనుకున్న విధంగా హామీలు నెరవేరలేదు అని అంటున్నారు.

ఇపుడు చంద్రబాబు ప్రభుత్వం పరిశ్రమలకు ఫ్రెండ్లీ నేచర్ తో ఉండడంతో ఎల్జీ పాలిమర్స్ ని శ్రీ సిటీకి తరలించేందుకు ఆ సంస్థ యాజమాన్యం ముందుకు వచ్చింది అని చెబుతున్నారు. అంతే కాదు దీని వల్ల కొత్తగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు.

ఇదిలా ఉండగా ఏకంగా 120 కోట్ల రూపాయలను అదనపు నష్ట పరిహారంగా చెల్లించేందుకు ఆ సంస్థ ముందుకు రావడం అంటే మెచ్చతగినదే అంటున్నారు. దీని వల్ల ఏకంగా అయిదు వేల మంది బాధిత కుటుంబాలకు ఆర్ధికంగా సాయం లభిస్తుందని అంటున్నారు. అదే విధంగా ఎల్జీ పాలిమర్స్ సంస్థ కూడా ఏపీ నుంచి వెళ్ళకుండా మరింత మందికి ఉపాధి మార్గాలు దక్కుతాయి. ఏది ఏమైనా బాబు వచ్చిన తరువాత ఎల్జీ సంస్థ ప్రతినిధులు మళ్లీ ఏపీ వైపు చూడడం ఈ విధంగా వారిలో కొత్త మార్పు రావడంతో అంతా బాబా మజాకా అని అంటున్నారుట.