ఎన్నారై యశస్వికి గుడ్ న్యూస్... సీఐడీకి హైకోర్టు కీలక ఆదేశాలు!
ఈ సమయంలో గత శుక్రవారం అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరి వచ్చిన యశస్వీని శంషాబాద్ విమానాశ్రయంలో ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
By: Tupaki Desk | 26 Dec 2023 9:53 AM GMTఏపీ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎన్నారై యశస్వి అలియాస్ యష్ పొద్దులూరిని ఏపీ సిఐడీ పోలీసులు అరెస్ట్ చేసి, 41ఏ కింద నోటీసులు ఇచ్చి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్ ని ఉగ్రవాదులతో పోలుస్తూ యశస్వీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఏపీ సీఐడీ సీరియస్ గా తీసుకుంది. దీంతో అతడిపై కేసు నమోదు చేసిందని తెలుస్తుంది.
ఈ సమయంలో గత శుక్రవారం అమెరికా నుంచి ఇండియాకు బయలుదేరి వచ్చిన యశస్వీని శంషాబాద్ విమానాశ్రయంలో ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనకు 41ఏ క్రింద నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. ఈ క్రమంలో... జనవరి 11వ తేదీన విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని కోరారు.
ఈ క్రమంలో యశస్వి పాస్ పోర్టును ఏపీ సీఐడీ స్వాధీనం చేసుకుంది. దీంతో తన పాస్ పోర్టును ఇప్పించాలని కోరుతూ యశస్వి రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో... తాజాగా ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. యశస్వి పాస్ పోర్టు ఇవ్వాలని సీఐడీని ఆదేశించింది.
కాగా... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై అమెరికాలో ఉంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన యశస్విపై ఏపీ సిఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనపై నిత్యం విమర్శలు చేసే అతడు... ఒకానొకదశలో జగన్ ను ఉగ్రవాదితో పోల్చాడు. జగన్ ఆలోచనలు కూడా ఉగ్రవాదుల ఆలోచనల మాదిరిగానే ఉంటాయంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించాడు.
ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. ఇదే సమయంలో... వైఎస్ జగన్ తన తండ్రిని చంపి సీఎం అవ్వాలని భావించాడని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. దీంతో ఈ శృతిమించిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ సమయంలో ఈ విషయాన్ని ఏపీ సీఐడీ సీరియస్ గా తీసుకుంది. ఇందులో భాగంగా అమెరికా ఫ్లైట్ దిగగానే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకుంది.