10వేల మార్కు దాటేసిన ఎన్టీవోడి స్మారక నాణెల అమ్మకాలు
ఈ నాణెల్ని నాలుగు వేరియంట్లలో అమ్మకానికి పెట్టగా.. చెక్క పెట్టెలో పొందుపర్చిన నాణెన్ని కొనుగోలు చేయటానికి వినియోగదారులు పెద్ద ఎత్తున ఆసక్తిని చూపారు.
By: Tupaki Desk | 2 Sep 2023 4:54 AM GMTతెలుగువారికి ఆరాధ్యనీయుడైన ఎన్టీఆర్ కున్న క్రేజ్ ఎలాంటిదన్న దానికి నిదర్శనంగా.. తాజాగా ఆయన శతజయంతిని ఫురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ స్మారక నాణెన్ని విడుదల చేయటం తెలిసిందే. రూ.100 ముఖ విలువ (బహిరంగ మార్కెట్ లో చెల్లుబాటు కాదు) ఉన్న ఈ నాణెంను ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేయటం తెలిసిందే. బహిరంగ మార్కెట్ లో ఈ నాణెన్ని అమ్మకానికి ఉంచటం.. దీనికి పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడటం తెలిసిందే.
ఆన్ లైన్ లోనూ.. ఆఫ్ లైన్ లోనూ అమ్మకాలకు పెట్టటం.. ఆన్ లైన్ లో ఉంచిన స్టాకు నిమిషాల్లో పూర్తి కావటంతో ఆవుటాఫ్ స్టాక్ గా మారింది. ఇక.. ఆఫ్ లైన్ లోనూ తొలిరోజున 5వేల నాణెలు అమ్మకాలు సాగాయి. హైదరాబాద్ లోని సైఫాబాద్ లోనూ.. చర్లపల్లిలోని మింట్ కేంద్రాల్లో ఈ నాణెం అమ్మకాలు సాగించటం తెలిసిందే. మొత్తం 12వేల నాణెల్ని ముద్రించగా.. వీటికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉండటంతో మరోసారి వీటిని ముద్రిస్తారని చెబుతున్నారు.
తాజాగా ఈ నాణెల అమ్మకాలు 10 వేల మార్కును దాటేయటం గమనార్హం. ఈ నాణెల్ని నాలుగు వేరియంట్లలో అమ్మకానికి పెట్టగా.. చెక్క పెట్టెలో పొందుపర్చిన నాణెన్ని కొనుగోలు చేయటానికి వినియోగదారులు పెద్ద ఎత్తున ఆసక్తిని చూపారు. ఈ నాణెం రూ.4 వేల నుంచి రూ.5వేల లోపు వరకు ఉండటం తెలిసిందే. భవిష్యత్తులు ఈ లిమిటెడ్ ఎడిషన్ నాణెలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుందన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు ఎన్టీఆర్ మీద ఉన్న అబిమానంతో దీన్ని కొనుగోలు చేయటానికి పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది. చెక్క పెట్టెలో నాణెల స్టాక్ అయిపోవటంతో.. త్వరలోనే మరిన్ని నాణెల్ని అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు.