ఎన్టీఆర్ స్మారక నాణెం ధరెంత? ఎలా కొనొచ్చు?
ఈ నాణెం ప్రత్యేకత ఏమంటే.. 50 శాతం వెండితోనే.. 40 శాతం రాగితోనూ.. 5 శాతం జింక్.. 5 శాతం నికెల్ మిశ్రమంతో దీన్ని రూపొందించారు.
By: Tupaki Desk | 29 Aug 2023 4:53 AM GMTతెలుగోళ్ల ఆరాధ్యదైవం ఎన్టీయార్ స్మారక నాణెం విడుదలైన విషయం తెలిసిందే. రూ.100 ముఖ విలువ కలిగిన ఈ నాణెన్ని సొంతం చేసుకోవటానికి పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది. మరి.. దీన్ని సొంతం చేసుకోవాలంటే ఎలా? ఏం చేయాలన్నది ప్రశ్నగా మారింది. కేంద్ర ఆర్థిక శాఖ ముద్రించిన ఎన్టీఆర్ శతజయంతి రూ.100 నాణెన్ని ఎవరైనా సొంతం చేసుకోవచ్చు. దీని కోసం ఇండియా గవర్నమెంట్ మింట్ వెబ్ సైట్ లో ఆర్డర్ చేయటం ద్వారా కానీ.. లేదంటే మింట్ కౌంటర్లలో కానీ కొనుగోలు చేసే వీలుంది.
హైదరాబాద్ వాసులు అయితే.. సైఫాబాద్.. చెర్లపల్లిలోని మింట్ విక్రయ కౌంటర్ల వద్దకు వెళ్లి నేరుగా కొనుగోలు చేసే వీలుంది. ఈ నాణెం ప్రత్యేకత ఏమంటే.. 50 శాతం వెండితోనే.. 40 శాతం రాగితోనూ.. 5 శాతం జింక్.. 5 శాతం నికెల్ మిశ్రమంతో దీన్ని రూపొందించారు.
ఈ నాణెం ఖరీదు విషయానికి వస్తే.. చెక్క డబ్బాతో ఉన్న నాణెన్ని కొనుగోలు చేయాలంటే రూ.4850 మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలాకాకుండా ఫ్రూఫ్ ఫోల్డర్ ప్యాబహక్ లో అయితే రూ.4380, యూఎన్ సీ ఫోల్డర్ ప్యాక్ అయితే రూ.4050గా ధరల్ని నిర్ణయించారు.
ఇదేమీ కాకుండా మామూలుగా తీసుకోవాలంటే రూ.3500 ఆరంభ ధర ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటివరకు 12615 వేల మధ్య నాణెల్ని తయారు చేసినట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ నాణెలకు విపరీతమైన డిమాండ్ ఉందని.. రానున్న రోజుల్లో మరిన్ని నాణెల్ని తయారు చేయనున్నట్లుగా చెబుతున్నారు. ఈ నాణెనికి బహిరంగ మార్కెట్లో చెల్లుబాటు కాదు. కాకుంటే.. కొన్నేళ్ల తర్వాత ఈ ప్రత్యేక నాణెలకు భారీ డిమాండ్ నెలకొంటుంది. ఈ నాణెల్ని సొంతం చేసుకోవాలంటే ఆన్ లైన్ లో ద్వారా ఆర్డర్ పెట్టుకునే వీలుంది.