ఎన్టీఆర్ 'చెల్లి' కన్నుమూత
పాడిపరిశ్రమలో విజయ డెయిరీని స్థాపించి న సీతాదేవి.. తర్వాత కాలంలో ఎన్టీఆర్‌టీడీపీ పెట్టిన తర్వాత.. ఆయన వెంట నడిచారు.
By: Tupaki Desk | 27 May 2024 7:01 AM GMTదివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆప్యాయంగా 'చెల్లీ' అని పిలుచుకున్న మహిళా నాయకురాలు.. యెర్నే ని సీతాదేవి కన్ను మూశారు. 1985,1994లలో ముదినేపల్లి శాసనసభ్యురాలిగా విజయం దక్కించుకున్న యెర్నేని సీతాదేవి.. తొలినాళ్లలోనే ఎన్టీఆర్‌ను ఆకర్షించారు. పాడిపరిశ్రమలో విజయ డెయిరీని స్థాపించి న సీతాదేవి.. తర్వాత కాలంలో ఎన్టీఆర్‌టీడీపీ పెట్టిన తర్వాత.. ఆయన వెంట నడిచారు. ఈ క్రమంలోనే 1983లోనే ఆమెకు టికెట్ ఇచ్చారు. కానీ.. అప్పటి ఎన్నికల్లోఆమె ఓడిపోయారు.
తర్వాత.. 1985, 1994లో మాత్రం టీడీపీ తరఫున పోటీచేసిన సీతాదేవి విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు ఎన్టీఆర్ 1988లో తన కేబినెట్‌లో విద్యా శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఆమె అప్పట్లో తీసుకువచ్చిన సంస్కరణలే ఇప్పటికీ అమలవుతుండడం గమనార్హం. అప్పటి వరకు పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్ కాన్సెప్ట్ లేదు. దీనిని ఆమె ప్రవేశ పెట్టారు. అలాగే.. గిరిజన విద్యార్థులకు 20 మార్కులనే పాస్ మార్కుగా ప్రకటించారు. దీనిని ఎన్టీఆర్ కూడా అమలు చేశారు.
తర్వాత.. ఎత్తేశారు. ఇక, 7వ తరగతికి కామన్‌పరీక్షలు నిర్వహించాలన్న కాన్సెప్టును కూడా.. సీతాదేవి తీసుకువచ్చారు. దీంతో విద్యా వ్యవస్థ మరింత పటిష్టమైంది. ఇక, పార్టీ పరంగా ఆమె.. ఎన్టీఆర్‌కు అత్యంత కీలకమైన నాయకురాలిగా వ్యవహరించారు. చెల్లి.. చెల్లి.. అంటూ ఎన్టీఆర్ మురిసిపోయేవారు. ఆయనకు ఇష్టమైన పదార్థాలను స్వయంగా వండివడ్డించేవారట సీతాదేవి. ఇక, తమ సొంత సంస్థ విజయ డెయిరీని.. ప్రభుత్వ రంగంలోకి తీసుకుంటామని ఎన్టీఆర్ చెప్పినప్పుడు.. కూడా సంతోషంగా ఇచ్చేశారు.
ఈ క్రమంలోనే విజయడెయిరీ తొలి డైరెక్టర్‌గాకూడా.. సీతాదేవి వ్యవహరించారు. కాగా.. సీతాదేవి సోమవా రంఉదయం హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందారు. కైకలూరు నియోజకవర్గం, కలిదిండి మం డలం, కొండూరుకు చెందిన సీతాదేవి.. మంత్రిగా, విద్యాధికురాలిగా.. ఎంతో పేరు తెచ్చుకున్నారు. నిరా డంబరత.. ఆమెకు ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. టీడీపీలో రెండున్నర దశాబ్దాల పాటు యెర్నేని సీతాదేవి సేవలు అందించారు.