Begin typing your search above and press return to search.

నూజివీడులో మునుగుతున్న వైసీపీ.. !

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో కీలక‌మైన నూజివీడు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప‌రిస్థితి మునిగే నావ‌గా మారింది.

By:  Tupaki Desk   |   3 Feb 2025 6:00 AM IST
నూజివీడులో మునుగుతున్న వైసీపీ.. !
X

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో కీలక‌మైన నూజివీడు నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప‌రిస్థితి మునిగే నావ‌గా మారింది. మాజీ ఎమ్మెల్యే ప్ర‌తాప్‌ అప్పారావు సైలెంట్ అయిపోవ‌డం.. ఆయ‌న కుమారుడు కూడా మౌనంగా ఉండ డంతో రాజ‌కీయంగా నూజివీడులో వైసీపీ ప‌రిస్థితి ఇబ్బందిగా మారింది. ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్న ట్టుగా నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ ప‌రిస్థితి ఏకంగా.. మునిసిప‌ల్ కౌన్సిల్‌లోని వైసీపీ స‌భ్యులు పార్టీ మారిపోయేందుకు దారితీస్తోంది.

తాజాగా ప‌లువురు వైసీపీ కౌన్సిల‌ర్లు.. టీడీపీలోకి జంప్ చేసేందుకు రెడీ అయ్యారు. వారితో కీల‌క నాయ‌కు లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని తెలుస్తోంది. ఈ చ‌ర్చ‌లు ఫ‌లిస్తే.. కౌన్సిల‌ర్లు గుండుగుత్త‌గా సైకిల్ ఎక్కేయ డం ఖాయం. ఇదే జ‌రిగితే నూజివీడు వైసీపీ ఇక దుకాణం మూసేసే ప‌రిస్థితి వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేద‌ని తెలుస్తోంది. నిజానికి వ‌రుస విజ‌యాలు అందుకున్న వైసీపీ నేత ప్ర‌తాప అప్పారావు క‌నుస‌న్న‌ల్లోనే గ‌తంలో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది.

కానీ, ఆ త‌ర్వాత జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అప్పారావు ఓడిపోవ‌డం.. త‌ర్వాత మారిన ప‌రిణామాల నేప థ్యంలో ఆయ‌న పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హించ‌డం లేదు. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ కేడ‌ర్ దూరంగా ఉంటోంది. ఈ ప‌రిణామాలు.. కూట‌మి నాయ‌కుల‌కు క‌లిసి వ‌చ్చాయి. రాష్ట్రంలో అవ‌కాశం ఉన్న చోట‌ల్లా వైసీపీని డైల్యూట్ చేస్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు నూజివీడు విష‌యంపైనా చ‌ర్చ సాగుతోంది. గ‌త కొన్నాళ్లుగా ఇక్క‌డ సీనియ‌ర్ నేతలు ప‌క్కా ప్లాన్ చేస్తున్నారు.

అభివృద్ధి నిధులతో పాటు.. స్థానికంగా కూడా కాంట్రాక్టుల విష‌యంలో సానుకూల ప‌రిణామాలు వైసీపీ నేత‌ల‌కు క‌లిసివ‌స్తున్నాయి. దీంతో వారు.. కూట‌మి వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కౌన్సిల్ విష యంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నారు. రెండు మూడు రోజుల్లోనూజివీడు మునిసిపాలి టీలోని వైసీపీ నాయ‌కులు కూట‌మి పార్టీల్లో విల‌న‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ జోరుగా సాగుతుండ డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.