Begin typing your search above and press return to search.

జిరాక్స్ సెంటర్ లో ఆఫీస్... ఆ పార్టీకి రూ. 56 కోట్లు విరాళం!

ఈ నేపథ్యంలో విచిత్రమైన విషయాలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 May 2024 4:00 AM GMT
జిరాక్స్  సెంటర్  లో ఆఫీస్... ఆ పార్టీకి రూ. 56 కోట్లు విరాళం!
X

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో విచిత్రమైన విషయాలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా నామినేషన్స్ సమయంలో సమర్పించిన అఫిడవిట్ లలో ఎన్నో విచిత్ర విషయాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఒక రాజకీయ పార్టీకి వచ్చిన విరాళం వైరల్ గా మారింది!

అవును.. చాలా మంది వ్యక్తులు కొన్ని రాజకీయ పార్టీలకు హవాలా ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు ఇచ్చినట్లు చూపించి పన్ను ఎగ్గొడుతున్నారనే చర్చ బలంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలో ఒక ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. పెద్దగా మనుగడ లేని రాజకీయ పార్టీకి సుమారు 56 కోట్ల రూపాయల విరాళం అందింది!

వివరాళ్లోకి వెళ్తే... సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే పార్టీకి 56 కోట్ల విరాళం అందిన విషయం ఆసక్తిగా మారింది! అసలు గుర్తింపు లేని ఈ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు సమర్పించే అఫీడివిట్‌ లో తమకు సొంత ఇల్లు, వాహనాలు లేవని పేర్కొన్నారు. ఆ పార్టీ అభ్యర్థులు ముంభై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్, ముంభై ఈస్ట్ నియోజకవర్గాల నుంచి ఆ ముగ్గురు పోటీ చేశారు.

ఈ సమయంలో... ఆ పార్టీని స్థాపించింది దశరథ్ పారిఖ్.. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 కింద పార్టీ అవసరాల కోసం ఎలక్టోలర్ బాండ్ల రూపంలో పార్టీ ఫండ్స్ సేకరించారట! ఈ నేపథ్యంలో 2022లో తమ పార్టీకి రూ.56 కోట్లు ఫండ్స్ వచ్చాయని ఆ పార్టీ ఈసీకి తెలిపింది. అయితే... వాటికి లెక్కులు తప్పుగా చూపారని అంటున్నారు.

ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఆపార్టీ ఆఫీస్ బోరివలి ఈస్ట్ లోని ఓ జిరాక్స్ సెంటర్లో ఉండటం!