Begin typing your search above and press return to search.

సీన్ రివర్సు: కారు బానెట్ లో రూ.కోటి.. పొగలతో పరార్.. తర్వాతేమైంది?

అదో ఖరీదైన కారు. రోడ్డు మీద వేగంగా వెళుతోంది. ఉన్నట్లుండి కారు బానెట్ లో నుంచి పొగలు రావటంతో కారును సడన్ గా ఆపేశారు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 4:51 AM GMT
సీన్ రివర్సు:  కారు బానెట్ లో రూ.కోటి.. పొగలతో పరార్.. తర్వాతేమైంది?
X

అదో ఖరీదైన కారు. రోడ్డు మీద వేగంగా వెళుతోంది. ఉన్నట్లుండి కారు బానెట్ లో నుంచి పొగలు రావటంతో కారును సడన్ గా ఆపేశారు. అంతేనా.. కారులో ఉన్న వారు ఒక్క ఉదుటున కారులో నుంచి బయటకు వచ్చేశారు. కారులోని ఒకరు పరుగులు పెడుతూ వెళ్లిపోగా.. మరొకరు మాత్రం అనూహ్యంగా వ్యవహరించారు. కారు బానెట్ తీసి.. అందులోని నోట్ల కట్టల్ని తీసుకొని వెళ్లిపోయారు. సినిమాటిక్ గా చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆసక్తికరంగా మారింది.

వరంగల్ సమీపంలోని వరంగల్ - ఖమ్మం నేషనల్ హైవే మీద ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కారు ఇంజిన్ బానెట్ కింద డబ్బుల్ని పెట్టి.. అక్రమంగా తరలిస్తున్నారు. ఇంజిన్ వేడి కారణంగా నోట్ల కట్టలు తగలబడటంతో ఒక్కసారిగా ఇంజిన్ నుంచి పొగలు రావటం మొదలయ్యాయి. దీంతో.. కారులోని వారు కారును.. కారు బానెట్ లో ఉన్న డబ్బుల్ని వదిలేసి వెళ్లిపోయారు. అయితే.. ఆ కారు వెనుకనే వచ్చిన మరో వ్యక్తి మాత్రం నోట్ల కట్టల సంచిని తన వెంట తీసుకెళ్లారు.

ఆ సంచిలో దాదాపు రూ.50 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. మొత్తంగా రూ.కోటి వరకు కారులో తరలిస్తున్న వేళ.. అనూహ్యంగా ఈ ప్రమావదం చోటు చేసుకుంటుందని భావిస్తున్నారు. అయితే.. ఈ డబ్బులు ఎవరివి? ఆ కారు ఎవరిది? కారును వదిలేసి వెళ్లినోళ్లు ఎవరు? వెనుక కారులో వచ్చి డబ్బు మూటను తమతో తీసుకెళ్లింది ఎవరు? లాంటి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. కారు నెంబరు ఆధారంగా చూస్తే.. మణిరాజు అనే పేరుతో ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే.. ఇది నకిలీ వ్యవహారంగా భావిస్తున్నారు. కారు బానెట్ లో నుంచి డబ్బుల కట్టల్ని తీసే క్రమంలో..కొన్ని నోట్లు రోడ్ల మీద పడిపోగా.. వాటిని అలానే వదిలేసి వెళ్లిపోయారు. దీంతో అక్కడకు వెళ్లిన కొందరు ఆ నోట్లను తీసుకున్నారు. స్థానికంగా ఈ ఉదంతం సంచలనంగా మారింది.