అమెరికాలో వీకెండ్ లో కాల్పులు.. మృతుల వివరాలివే!
ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారని తెలుస్తుంది.
By: Tupaki Desk | 19 May 2024 5:49 AM GMTఅమెరికాలో వీకెండ్ రచ్చ తెరపైకి వచ్చింది. వీకెండ్ లో ఒహియో రాజధానిలో తెల్లవారుజామున ఎవరు చేశారో, ఎంతమంది పాల్గొన్నారో తెలియదు కానీ ఒక్కసారిగా కాల్పుల మోత మోగింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఈ మేరకు కొలంబస్ పోలీసులు వివరాలు వెల్లడించారు.
అవును... అగ్రరాజ్యం అమెరికాలో వారంతంలో కాల్పుల మోత మోగింది. ఇందులో భాగంగా... ఒహియో రజధానిలోని డౌన్ టౌన్ కు ఉత్తరాన ఉన్న ఇటాలియన్ విలేజ్ పరిశరాల్లో శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ముందు కాల్పులు జరిగినట్లు కొలంబస్ పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయపడ్డారని తెలుస్తుంది.
ఈ ఘటనపై డిప్యూటీ చీఫ్ గ్రెగొరీ బోడ్కర్ స్పందిస్తూ... ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు మృతి చెందగా... ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మరణించారని తెలిపారు. ఇక మూడవ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో వారి వివరాలు సేకరించించి వెల్లడించారు.
ఇందులో భాగంగా... మృతులను మలాచి పీ (27), గార్సియా డిక్సన్ జూనియర్ (26), డాన్డ్రే బుల్లక్ (18) గా గుర్తించారట అధికారులు. ఇక తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని ఆసుపత్రులకు తరలించగా.. ప్రస్తుతం వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, మిగిలిన ఇద్దరి పరిస్థితి కాస్త నిలకడగా ఉందని బోడ్కర్ తెలిపారు.
ఇదే సమయంలో... సమీపంలోని ఓ కార్నర్ లో బార్ ఉండటంతో... ఈ కాల్పులకు కారణమైన వారు దానికి సంబంధించివారు ఎవరైనానా.. లేక, ఇతరులా అనే విషయాలపై పోలీసులు ఆరాతీస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతనికి మాత్రం ఈ కాల్పులకు కారణం తెలియలేదని, ఎంత మంది పాల్గొన్నారనే విషయంపైనా స్పష్టత రాలేదని అధికరులు చెబుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ప్రత్యక్ష సాక్ష్యులను విచారించడం.. సీసీ కెమెరాల వీడియోలను సేకరించడం వంటి పనుల్లో ఉన్నారని తెలుస్తుంది. ఈ ఘటనలోని మృతుల్లో కానీ, గాయపడిన వారిలో కానీ భారతీయులు ఎవరూ లేకపోవడంతో ఇక్కడివారు కాస్త ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి అని తెలుస్తుంది!