మీ వెహికిల్ 20 ఏళ్లు దాటితే.. ఛార్జీల వాతలకు కేంద్రం కసరత్తు
20 ఏళ్లు దాటిన వాహనాలకు భారీగా చార్జీల షాకిచ్చే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇరవై ఏళ్ల వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెన్యువల్ చార్జీలను సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేశారు. దీని
By: Tupaki Desk | 23 Feb 2025 5:01 AM GMTమీ దగ్గర పాత కారు ఉందా? 20 ఏళ్లు దాటిన టూవీలర్ ఉందా? ఇలా ఉన్న వారికి షాకిచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన ఛార్జీల వాతలు వేసేందుకు తయారవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. అయితే.. అధికారికంగా ఇంకా నిర్ణయం తీసుకోలేదు. చర్చల దశలో ఉన్న ఈ ఛార్జీల వివరాలు చూస్తే మాత్రం.. రానున్న రోజుల్లో మోగే మోత ఎంత ఎక్కువగా ఉందో ఇట్టే అర్థమవుతుంది.
20 ఏళ్లు దాటిన వాహనాలకు భారీగా చార్జీల షాకిచ్చే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇరవై ఏళ్ల వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రెన్యువల్ చార్జీలను సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేశారు. దీని ప్రకారం టూ వీలర్లకు అయితే ఏడాదికి రూ.2 వేలుచొప్పున.. అదే కార్లకు అయితే ఏడాదికి రూ.10 వేల చొప్పున రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాల ప్రకారం 20 ఏళ్లు దాటిన తర్వాత రెన్యువల్ కోసం వెళితే.. ఐదేళ్ల వరకు మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు.
కొత్త విధానం అమల్లోకి వస్తే.. ప్రతి ఏడాది కొత్త ఛార్జీలను చెల్లించి.. రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. 20 ఏళ్లు దాటిన వాహనాలకు ప్రతి ఏడాది ఆర్టీవో కార్యాలయానికి వెళ్లి.. అక్కడ ఫిట్ నెస్ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. అందులో నెగ్గితేనే.. వాహనాలను రెన్యువల్ చేస్తారు. ఇక.. ఆటో రిక్షాలు.. ఇతర వాహనాల రెన్యువల్ ఛార్జీలను సైతం భారీగా పెంచే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది.
ప్రస్తుతం 15 ఏళ్లు దాటిన బైక్ కు ఐదేళ్ల రెన్యువల్ రూ.2 వేలు.. 20 ఏళ్లు దాటితే రూ.5 వేలు ఛార్జీలు ఉన్నాయి. అదే కార్ల విషయానికి వస్తే 15 ఏళ్లు దాటిన కార్లకు ఐదేళ్ల రెన్యువల్ ఫీజు కింద రూ.5వేలు.. 20 ఏళ్లు దాటితే రూ.10 వేలు ఉంది. కొత్త విధానంలో మాత్రం ప్రతి ఏటా ఛార్జీలు చెల్లించాల్సి ఉంది.చూస్తుంటే.. రానున్న రోజుల్లో పాత వాహనాలకు చెల్లించాల్సిన ఛార్జీల షాక్ భారీగా ఉండనుంది.