యువకులతో వృద్ధ మహిళల రొమాన్స్ & జంప్!
అవును... ఇప్పుడు ఆఫ్రికాలోని ఒక చిన్న దేశానికి ఒక పెద్ద సమస్య వచ్చిపడిందంట.
By: Tupaki Desk | 19 Jan 2024 11:30 PM GMTప్రేమకు కులం, మతం, వయసు, ప్రాంతం, ఐశ్వర్యం, అందం ఇలాంటివేవీ అడ్డుకాదని అంటుంటారు. ఇదే సమయంలో అవసరానికి కూడా ఇవేవీ అడ్డుకాదనే కామెంట్లు కొన్ని సందర్భాల్లో వినిపిస్తుంటాయి. ఆ అవసరం ఏదైనా కావొచ్చు.. ఎటువంటిదైనా కావొచ్చు అని చెబుతుంటారు!! ఆ సంగతి అలా ఉంచి పాయింట్ లోకి వచ్చేస్తే... తాజాగా ఒక దేశానికి సరికొత్త సమస్య వచ్చిపడింది. ఆ దేశంలోని యువకులను వృద్ధ మహిళలు ఎగరేసుకుపోతున్నారట!
అవును... ఇప్పుడు ఆఫ్రికాలోని ఒక చిన్న దేశానికి ఒక పెద్ద సమస్య వచ్చిపడిందంట. పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఆ చిన్న దేశానికి వచ్చే పెద్ద వయసున్న మహిళలు.. అక్కడ గైడ్ గా సహకరించే యువకులతో పరిచయం స్నేహం ప్రేమగా మారి.. వారితో పాటే ఆయా దేశాలకు తీసుకెళ్లిపోతున్నారంట! దీంతో ఆ దేశంలో ఇదొక పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు.
వివరాళ్లోకి వెళ్తే... ఆఫ్రికాలోని చిన్న దేశాల్లో ఒకటైన గాంబియాలో ఇప్పుడు సరికొత్త సమస్య తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఆకలి, నిరుద్యోగం, మొదలైన సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న ఆ దేశంలో మరో సమస్య వెంటాడుతోందట. పాశ్చాత్య దేశాల నుంచి మధ్యవయసు మహిళలు.. ఇక్కడి యువకులతో స్నేహం కోసం రావడం, తర్వాత వారిని తీసుకుపోవడం ఇబ్బందికర పరిణామంగా మారుతోందని అంటున్నారు.
ఈ గాంబియా దేశానికి పర్యాటక రంగమే ప్రధాన ఆదయ వనరుగా ఉంది. ఇక్కడ బీచ్ లలో సేదతీరేందుకు యూరోప్ దేశాల నుంచి పర్యాటకులు ఎక్కువగానే వస్తుంటారు. వీరిలో ఒంటరి మహిళలు, ముఖ్యంగా విడాకులు తీసుకుని ఒంటరిగా జీవితం గడుపుతున్న వారు ఎక్కువగా ఉంటారట. ఈ క్రమంలో... అలా ఒంటరిగా వచ్చిన మహిళలు వెళ్లేటప్పుడు జంటగా వెళ్తున్నారంట.
కారణం... ఇలా ఒంటరిగా వచ్చిన మహిళలతో అక్కడి యువకులకు పరిచయం ఏర్పడి అది వారి మధ్య సాన్నిహిత్యానికి దారి తీసి.. సహజీవనంగా మారుతోందట. ఇది పేద దేశం కావడంతో పలువురు యువకులు మరో ఉద్యోగాలు లేక పర్యాటక రంగంలో గైడ్లుగా పని చేస్తుంటారు. ఈ సమయంలో.. సంపన్న దేశాల నుంచి వచ్చే మధ్యవయసు మహిళలతో అనుబంధం ఏర్పరుచుకుంటున్నారని అంటున్నారు.
ఇలా వారి మధ్య పరిచయం స్నేహంగా, స్నేహం ప్రేమగా, ప్రేమ సహజీవనానికి దారి తీసి వారితో పాటే ఆయా దేశాలకు వెళ్తుంటారని చెబుతున్నారు. పైగా అత్యంత పేదరికం అనుభవించే పలు దేశాల ఆఫ్రికా యువతకు యూరోప్ లో స్థిరపడాలన్నది కల అని.. ఫలితంగా పాశ్చాత్య మహిళలతో స్నేహంతో ఆయా దేశాల్లోకి వెళ్లి ఉపాధి పొందుతున్నారని అంటున్నారు.
కాగా... ఇటీవలే 32 ఏళ్ల గాంబియా దేశ యువకుడు 65 ఏళ్ల మహిళను వివాహమాడటం.. ఆమెతో పాటు విదేశాలకు వెళ్లిపోవడం జరిగిందని చెబుతున్నారు.