Begin typing your search above and press return to search.

మరోసారి జిల్లాల పునర్విభజన... తెరపైకి 27వ జిల్లా!

ఇందులో భాగంగా... అన్నమయ్య జిల్లా ఏర్పాటును రద్దు చేసి పాత కడప జిల్లాను పునరుద్దరించాలని పలువురు నేతలు కోరుతున్నట్లు తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   3 Nov 2023 7:17 AM GMT
మరోసారి జిల్లాల పునర్విభజన... తెరపైకి 27వ జిల్లా!
X

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత జిల్లాల పునర్విభజన జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించిన సంగతి తెలిసిందే. పరిపాలనా సౌలభ్యంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు! ఆ సంగతి అలా ఉంటే... ఇప్పుడు తాజాగా మరోసారి జిల్లాల పునర్విభజనపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. జిల్లాల ఏర్పాటు తరువాత వచ్చిన అభ్యర్ధనలు, డిమాండ్ల పైన జరిగిన అధ్యయనంలో భాగంగా కొన్ని మార్పులు తెర మీదకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొత్త జిల్లా పేరు తెరపైకి వచ్చిందని తెలుస్తుంది.

అవును... ఏపీలో మరోసారి జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం మళ్ళీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా... కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న నేపథ్యంలో... పోలవరం నిర్వాసితులకు ప్రత్యేక జిల్లా ఉండాలనే ఉద్దేశ్యంతో కొత్త జిల్లా ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నేటి మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజనపైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉందని అంటున్నారు.

ఇందులో భాగంగా... అన్నమయ్య జిల్లా ఏర్పాటును రద్దు చేసి పాత కడప జిల్లాను పునరుద్దరించాలని పలువురు నేతలు కోరుతున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో కడప జిల్లాను అలానే ఉంచడంతోపాటు.. మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి నియోజక వర్గాలను చిత్తూరు జిల్లాలో కలపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో... కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలిపే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఈ అంశాలన్నింటిపైనా కేబినెట్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది!

ఇదే సమయంలో మరో రాయలసీమ జిల్లా అనంతపురం జిల్లాను తిరిగి పూర్వస్థాయికి తీసుకురావాలనే చర్చ కూడా నడుస్తుందని అంటున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాలతో ఏర్పాటైన ఇక పార్వతిపురం మన్యం జిల్లాఏర్పాటు అంశాన్ని ప్రభుత్వం పునఃపరిశీలిస్తుందని చెబుతుండగా... ఆ స్థానంలో పోలవరం కేంద్రంగా కొత్తగా మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది.

అయితె...పార్వతీపురం మన్యం జిల్లా... భౌగోళికంగా చిన్న జిల్లా కావడం, మరికొన్ని కారణాలతో పార్వతిపురం మన్యం జిల్లాను రద్దు చేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో మరో గిరిజన ప్రాంతమైన రంపచోడవరం నియోజకవర్గం.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. దీంతో... ఆయా ప్రాంత గిరిజనులు ప్రస్తుతం జిల్లా కేంద్రమైన పాడేరుకు కార్యాలయ పనుల కోసం రావాలంటే కనీసం 200 కిలో మీటర్లకు పైగా ప్రయాణించాల్సి రావడం కష్టమవుతోందనే విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవచ్చని తెలుస్తుంది.

ఫలితంగా... మన్యం జిల్లాను రద్దు చేసినా పోలవరం జిల్లా ఏర్పాటు ద్వారా గిరిజన జిల్లాల సంఖ్యలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదని అంటున్నారు. అదేవిధంగా... అన్నమయ్య జిల్లా ఏర్పాటును రద్దు చేసి పాత కడప జిల్లాను పునరుద్దరించాలనే ఆలోచనను పరిగణలోకి తీసుకోవడం వల్ల... జిల్లాల సంఖ్యలో మార్పు లేకపోవచ్చని మరో వెర్షన్ వినిపిస్తుంది. ఏది ఏమైనా... ఈ రోజు కేబినెట్ సమావేశం అనంతరం ఈ జిల్లాల పునర్విభజన విషయాలపై ఒక క్లారిటీ రావొచ్చని అంటున్నారు.