మంటల్లో లాస్ ఏంజెలెస్... ఆ ఒక్క ఇళ్లు మాత్రం ఎందుకు సేఫ్ తెలుసా?
అయితే... మంటలు అంటుకున్న అన్ని ఇళ్లూ కాలి బూడిదైనప్పటికీ.. ఒక ఇళ్లు మాత్రం అలా నిలబడే ఉంది.
By: Tupaki Desk | 12 Jan 2025 1:30 PM GMTఅమెరికాలోని లాస్ ఏంజెలెస్ ను చుట్టుముట్టిన కార్చిచ్చు.. కనీ వినీ ఎరుగని నష్టాన్ని కలిగించిందని చెబుతున్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రజలను వణికించేసిందని అంటున్నారు. ఈ క్రమంలో... ఈ కార్చిచ్చు కారణంగా సంభవించిన మరణాల సంఖ్య 16కు చేరిందని అంటున్నారు. ఒక్క ఎటోన్ ఫైర్ లోనే 11 మందిమరనించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్చిచ్చు వల్ల సంభవించిన ఆస్తి నష్టాల అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా... ఇప్పటివరకూ ఈ కార్చిచ్చు కలిగించిన ఆస్తి నష్టం సుమారు రూ.13 లక్షల కోట్లు ఉంటుందని అంచనా కాగా... దాదాపు లక్షన్నర మంది తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిన పరిస్థితి అని అంటున్నారు.
ఈ క్రమంలో... ఈ కార్చిచ్చు కారణంగా పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలోని అత్యంత ఖరీదైన భవనం శిథిలంగా మారిన విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఈ విలాసవంతమైన మాన్షన్ విలువ అక్షరాలా 1,077 కోట్ల రూపాయలుగా చెబుతున్నారు. దీనికి సంబంధించి పాత ఫోటోలు, నేటి ఫోటోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
సుమారు 18 పడక గదులున్న విలాస భవనం లుమినర్ టెక్నాలజీస్ సీఈఓ ఆస్టిన్ రస్సెల్ ది కాగా.. దీన్ని అద్దెకు ఇస్తేనే నెలకు సుమారు రూ.3 కోట్లకు పైనే వస్తోందని చెబుతున్నారు. ఇలాంటి ఇళ్లు నేడు మంటల్లో కాలి బూడిదైన పరిస్థితి. అయితే... ఈ కార్చిచ్చు కారణంగా చుట్టుపక్కల ఇళ్లు అన్నీ బూడిదైనా.. ఒక ఇళ్లు మాత్రం నిలబడి ఉండటం వైరల్ గా మారింది.
అవును.. లాస్ ఏంజెలెస్ నగరాన్ని కార్చిచ్చు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్చిచ్చు కారణంగా వేళ ఎకరాలు, ఎన్నో ఇళ్లు కాలి బూడిదైపోయినట్లు చెబుతున్నారు. అయితే... మంటలు అంటుకున్న అన్ని ఇళ్లూ కాలి బూడిదైనప్పటికీ.. ఒక ఇళ్లు మాత్రం అలా నిలబడే ఉంది. ఆ కార్చిచ్చు ఈ ఇంటిని ఏమీ చేయలేకపోయింది.
దానిపేరే "మాలిబు మాన్షన్". ఈ భవనం అగ్ని కిలల నుంచి సురక్షితంగా భయటపడింది. దానికి కారణం... ఈ భవనాన్ని ఫైర్ ప్రూఫ్ గా నిర్మించడమేనట. దీంతో... ఇంత పెద్ద కార్చిచ్చు వేల ఇళ్లు కాల్చి బూడిద చేసినా.. ఇది మాత్రం నికార్సుగా నిలబడిందని చెబుతున్నారు. భూకంపం వచ్చినా ఇది తట్టుకుంటుందని అంటున్నారు.