Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో నడిరోడ్డు మీద రెచ్చిపోయిన జంట

తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   26 Sep 2024 4:08 AM GMT
హైదరాబాద్ లో నడిరోడ్డు మీద రెచ్చిపోయిన జంట
X

వెనుకా ముందు చూసుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే ధోరణిని కొందరు ప్రదర్శిస్తున్నారు. ఫాంటసీ కోసమో.. సమ్ థింగ్ స్పెషల్ గా ఉండాలన్న లక్ష్యంతో చేస్తున్న పనులు వికారంగా మారుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంది. గడిచిన కొద్దికాలంగా దేశంలోని వివిధ నగరాల్లోనూ ఈ తరహా ఘటనలు వెలుగు చూడటం.. సోషల్ మీడియాలో వాటికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు వెలుగు చూడటం తెలిసిందే.

తాజాగా ఆ తరహా పాడుపని ఒకటి వెలుగు చూసింది. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోఒక జంట బైక్ వెళుతూ రొమాన్సు చేసుకున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏకాంతంగా ఉన్నప్పుడు చేయాల్సిన పనుల్ని నడిరోడ్డు మీద వెళుతున్న వేళలో చేసిన తీరును సోషల్ మీడియాలోనూ తిట్టి పోస్తున్నారు. బుధవారం జరిగినట్లుగా చెబుతున్న ఈ ఉదంతంలోకి వెళితే.. స్పీడ్ గా వెళుతున్న వెహికిల్ మీద పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చున్న యువతి.. బండిని నడుపుతున్న వ్యక్తికి ముద్దులు పెట్టిన వీడియో.. ఫోటోలు వైరల్ అయ్యాయి.

దీనిపై బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ నమోదైంది. పాతనగరానికి సమీపంలోని పహాడీషరీఫ్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఉదంతంపై స్పందించిన పలువురు ఈ ఉదంతాన్నివీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో.. వీరి రచ్చ వెలుగు చూసింది. దీనిపై ఒక ప్రయాణికుడు ట్విటర్ లో పోలీసులకు కంప్లైంట్ చేయటంతో.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.