Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో కొహ్లీ రెస్టారెంట్... టేబుల్ రిజర్వేషన్ నెంబర్స్ ఇవిగో!

టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ క్రీడారంగంలోనే కాక వ్యాపార రంగంలోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   25 May 2024 4:30 AM GMT
హైదరాబాద్ లో కొహ్లీ రెస్టారెంట్... టేబుల్ రిజర్వేషన్ నెంబర్స్ ఇవిగో!
X

టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ క్రీడారంగంలోనే కాక వ్యాపార రంగంలోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గానే కాకుండా ఇన్వెస్టర్ గా, వ్యాపార వేత్తగానూ కొహ్లీ రాణిస్తున్నారు. ఇందులో భాగంగా... కొహ్లీ వన్ 8 బ్రాండ్‌ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కొహ్లీ వన్ 8 హైదరాబాద్ లోనూ వెలిసింది.

అవును... విరాట్ కోహ్లీ "వన్ 8 కమ్యూన్" పేరుతో వివిధ నగరాల్లో రెస్టారెంట్లను తెరుస్తున్న సంగతి తెలిసిందే. కొహ్లీ వన్ 8 బ్రాండ్‌ పుమాతో కలిసిన తర్వాత వారి మార్కెట్ వ్యాల్యూ విపరీతంగా పెరిగినట్లుగా వ్యాపార వర్గాలు చెబుతుంటాయి! అంతటి క్రేజ్ ఉన్న విరాట్ కొహ్లీ.. రెస్టారెంట్ బిజినెస్ లో కూడా అదే తరహాలో దూసుకుపోతున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే "వన్ 8 కమ్యూన్" రెస్టారెంట్లు బెంగళూరు, ముంబయి, పుణె, కోల్‌ కతా, ఢిల్లీ నగరాల్లో ఉండగా... తాజాగా హైదరాబాద్ కు చేరింది. ఇందులో భాగంగా... హైటెక్ సిటీలోని నాలెడ్జ్ సిటీ సమీపంలో హార్డ్ రాక్ కేఫ్ దగ్గర్లో ఈ "వన్ 8 కమ్యూన్" రెస్టారెంట్‌ ను ఓపెన్ చేశారు.

ఆర్.ఎం.జెడ్. ది లాఫ్ట్‌ లో ఈ రెస్టారెంట్‌ తాజాగా ప్రారంభం అయింది. ఈ విషయాన్ని విరాట్ కొహ్లీ తన ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. ఇందులో భాగంగా... "హే హైదరాబాద్... నేనొక ఇంట్రస్టింగ్ విషయం మీతో పంచుకోవాలి. మేం ఇప్పుడే హైటెక్ సిటీకి వచ్చేశాం. ఇక మీ రెస్టారెంట్ ఎక్స్ పీరియన్స్ మరో స్థాయికి చేరనుంది" అని కొహ్లీ ఇన్ స్టాలో పేర్కొన్నారు.

ఇదే సమయంలో... తన వరకు వన్ 8 కమ్యూన్ అనేది ఒక స్థలం కంటే ఎక్కువ.. ఇది జనాల్ని ఏకం చేస్తుంది.. అని చెప్పిన కొహ్లీ... దీనితో కనెక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చని.. అసలైన కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవచ్చని.. ఇప్పుడు ఇది హైదరాబాద్ లో ఉందని రాసుకొచ్చారు.

అయితే టేబుల్స్ రిజర్వ్ చేసుకోవడం కోసం.. 95590 71818, 95590 81818 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయాలని కూడా కొహ్లీ సూచించారు. ఇక, ఇది స్టార్ క్రికెటర్ కొహ్లీ రెస్టారెంట్ కావడంతో.. ఒకసారి చూసేందుకు అని అనైనా అనేక మంది వెళ్తున్నారు.. ఈ రెస్టారెంట్ లో దేశీ వంటకాలతోపాటు విదేశీ వంటకాలను కూడా వడ్డించనున్నట్లు తెలుస్తోంది.