ఒక్కరు కాదు ఆ నియోజకవర్గానికి ముగ్గురు ఎంపీలు !
ఒక స్థానానికి ఒక్క ఎంపీనే ఉంటాడు. మరి ముగ్గురు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ? మీరు చదివింది నిజమే.
By: Tupaki Desk | 28 April 2024 11:41 AM GMTఒక స్థానానికి ఒక్క ఎంపీనే ఉంటాడు. మరి ముగ్గురు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా ? మీరు చదివింది నిజమే. అప్పట్లో ఒక స్థానానికి ముగ్గురు ఎంపీలు ఉండగా, అనేక స్థానాలకు ఇద్దరు ఎంపీలు ఉండడం విశేషం.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత లోక్ సభలో 400 స్థానాలు ఉండేవి. అప్పట్లో పశ్చిమ బెంగాల్ లోని నార్త్ బెంగాల్ నియోజకవర్గానికి ఏకంగా ముగ్గురు ఎంపీలు ఉండేవారు. ఇక 86 నియోజకవర్గాలకు ఒకరు జనరల్, ఒకరు షెడ్యూలు కులాల ప్రతినిధి లెక్కన ఇద్దరేసి ఎంపీలు ఉండేవారు. మిగిలిన నియోజకవర్గాలకు ఒక్కరేసి చొప్పున ఉన్నారు.
ఇలా ఇద్దరు లోక్ సభ సభ్యులు ఉన్న వాటిలో యూపీలో 17, ఉమ్మడి మద్రాసులో 13, బీహార్ లో 11, బొంబాయిలో 8 వరకు ఉండడం విశేషం. 1961లో రద్దు చేసే వరకు ఇది కొనసాగింది.
1957లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత దేశంలో 494 లోక్ సభ స్థానాలు ఏర్పాటు కాగా యూపీలో 18, ఏపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, బాంబేలలో 8 చొప్పున, మద్రాసులో 7 స్థానాలకు ఇద్దరు ఎంపీల చొప్పున ప్రాతినిధ్యం వహించడం విశేషం.