వీడియో... ఒక విమానం టేకాఫ్ కాకముందే.. మరో విమానం ల్యాండింగ్!
ఇటీవల కాలంలో వరుస విమాన ప్రమాదాలు ఎయిర్ బస్ ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Jun 2024 9:31 AM GMTఇటీవల కాలంలో వరుస విమాన ప్రమాదాలు ఎయిర్ బస్ ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే... అదృష్టవసాత్తు అన్నట్లుగా తృటిలో పెను ప్రమాదాలు తప్పుతున్నాయి. లేదంటే... భారీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఎదురయ్యేది. ఈ క్రమంలోనే ముంబై ఎయిర్ పోర్ట్ లోనూ పెను ప్రమాదం తప్పింది.
అవును... వందల మంది ప్రయాణికులకు ముంబై విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఇందులో భాగంగా రన్ వే పై ఇండిగో ఎయిర్ క్రాప్ట్ ల్యాండ్ అవుతుండగానే... అదే రన్ వేపై ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అవుతోంది. ఆ సమయంలో రెండింటికీ మధ్య కొన్ని వందల మీటర్లు మాత్రమే దూరం ఉంది. అయితే అదృష్టవసాత్తు ప్రమాదం తప్పింది.
దీంతో... ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెంటనే స్పందించింది. ఇందులో భాగంగా... ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందిని తక్షణమే విధుల నుంచి తప్పించింది. ఈ ఘటనపై ఇండిగో స్పందించింది. తమ పైలెట్ ముంబై ఎయిర్ పోర్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సూచనలను తూచా తప్పకుండా పాటించారని పేర్కొంది. తమకు ప్రయాణికుల భద్రతే ముఖ్యం అని వెల్లడించింది.
మరోపక్క ఎయిర్ ఇండియా కూడా ఈ ఘటనపై ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా తిరువనంతపురం వెళ్లే విమానానికి ఏటీసీ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతే బయలుదేరినట్లు తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించింది. అసలు అధికారులు ఎలా క్లియరెన్స్ ఇచ్చారనేది తెలియాల్సి ఉందని పేర్కొంది.
ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో... రెండు విమానాలు ఒకే రన్ వేపై ప్రయాణిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇండోర్ నుంచి ముంబై వచ్చిన ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా.. సరిగ్గా అదే సమయంలో తిరువనంతపురం వెళ్లాల్సిన విమానం గాల్లోకి ఎగిరింది.