Begin typing your search above and press return to search.

ఆన్‌ లైన్‌ గేమ్స్‌ లో ఆదాయం... జీఎస్టీ తగ్గించరా ప్లీజ్!

తమపై ఇటీవల విధించిన 28 శాతం జీఎస్టీని తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని ఆన్‌ లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ కోరింది

By:  Tupaki Desk   |   2 Aug 2023 6:53 AM GMT
ఆన్‌ లైన్‌ గేమ్స్‌ లో ఆదాయం... జీఎస్టీ తగ్గించరా ప్లీజ్!
X

తాజాగా చట్ట పరిధిలో పనిచేసే ఆన్‌ లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ.. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ఒక లేఖ రాసింది. తమపై ఇటీవల విధించిన 28 శాతం జీఎస్టీని తగ్గించాలని ఇండియన్‌ గేమర్స్‌ యునైటెడ్‌ ఆర్థిక మంత్రిని కోరింది. అధికపన్ను భారం వల్ల తలెత్తబోయే ఇబ్బందులను వివరించే ప్రయత్నం చేసింది.

అవును... తమపై ఇటీవల విధించిన 28 శాతం జీఎస్టీని తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని ఆన్‌ లైన్‌ గేమింగ్‌ పరిశ్రమ కోరింది. అధిక పన్ను భారం అనేది చట్టవిరుద్ధమైన గేమింగ్‌ సంస్థలను పరోక్షంగా ప్రోత్సహించినట్టు అవుతుందని అభిప్రాయపడింది. 28 శాతం జీఎస్టీ అనేది ఎదుగుతున్న ఆన్‌ లైన్‌ స్కిల్‌ గేమింగ్‌ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది.

ఇదే సమయంలో గుర్రపు పందేలు, జూదం వంటి అదృష్టాన్ని పరీక్షించుకునే గేమ్‌ లను.. నైపుణ్యాలతో కూడిన గేమ్‌ లను ఒకే గాటన కట్టొదంటూ విన్నవించింది ఆన్ లైన్ గేమింగ్ పరిశ్రమ. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని తిరిగి సమీక్షించాలని ఆన్ లైన్ గేమింగ్ అసోసియేషన్‌ కోరింది.

అదేవిధంగా.. పన్ను పరంగా అనుకూలంగా ఉండేలా పరిశ్రమ పట్ల వ్యవహరించాలని సూచించింది. ఆన్‌ లైన్‌ స్కిల్‌ గేమింగ్‌ లను యువత తమ గేమింగ్‌ నైపుణ్యాలతో ఆడుతుందని.. ఈ క్రమంలో కొంత ఆదాయాన్ని ఆర్జిస్తోందని వివరించింది. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్న చట్టపరిధిలోని ఆన్ లైన్ గేమింగ్ పై విధించే పన్నును తగ్గించాలని కోరింది.

ఇదే క్రమంలో... కేంద్రమంత్రికి రాసిన లేఖలో జూదానికీ – ఆన్ లైన్ గేంస్ కు తేడా చాలా ఉందని తెలిపిన అసోసియేషన్... గ్యాంబ్లింగ్‌ కు, స్కిల్‌ గేమింగ్‌ కు స్పష్టమైన వ్యత్యాసం చూపించాలని సూచించింది. దీనివల్ల చట్టవిరుద్దమైన గేంస్ పెరిగిపోయే ప్రమాధం ఉందని పునరుద్ఘాటించింది.

కాగా... అన్ని రకాల గేమింగ్‌ సంస్థలను 28 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తూ ఈ నెల మొదట్లో జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోన్న సంగతి తెలిసిందే.

ఇలా అన్ని ఆన్ లైన్ గేమింగ్ సంస్థలానూ ఒకే గాటిన కట్టడం భావ్యం కాదంటూ తాజాగా ఇండియన్‌ గేమర్స్‌ యునైటెడ్‌.. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాసింది. మరి ఈ లేఖపై కేంద్రమంత్రి ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి!