Begin typing your search above and press return to search.

వచ్చే నెల ఇదే రోజున వార్... తెలుగు రాష్ట్రాల్లో పార్టీల సందడిదే!

దీంతో అన్ని రాజకీయ పార్టీలూ మరింత సీరియస్ మోడ్ లోకి వెళ్లిపోయాయని తెలుస్తుంది!

By:  Tupaki Desk   |   13 April 2024 2:17 PM GMT
వచ్చే నెల ఇదే రోజున వార్... తెలుగు రాష్ట్రాల్లో పార్టీల సందడిదే!
X

పోలింగ్ కి చాలా రోజుల సమయం ఉంది అనే కామెంట్లు వినిపించిన నేపథ్యంలో.. ఇప్పుడు నెల రోజుల వ్యవధి మాత్రమే ఉందనే రోజు వచ్చేసింది. వచ్చే నెల ఇదే రోజున తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది. ఇందులో భాగంగా... తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు.. ఏపీలో అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలూ మరింత సీరియస్ మోడ్ లోకి వెళ్లిపోయాయని తెలుస్తుంది!

అవును... రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వచ్చే నెల ఇదే రోజున ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండగా 25వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 29తో నామినేషన్స్ విత్ డ్రా గడువు ముగియనుంది. ఇక మే 13న పోలింగ్ జరగనుండా.. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి! దీంతో... పోలింగ్ కి సరిగ్గా నెల రోజులు గడువు మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలూ స్పీడ్ పెంచుతున్నాయి!

ఇందులో భాగంగా ఏపీలో అధికార పార్టీ ఇప్పటికే "సిద్ధం" అంంటూ కార్యకర్తల సభలు.. "మేమంతా సిద్ధం" అంటూ బస్సు యాత్రలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బస్సు యాత్ర అనంతరం వైసీపీ ఎలాంటి ప్రచారాలకు తెర తీయబోతున్నాయనేది ఆసక్తిగా మారింది. ప్రధానంగా కొన్ని కీలక నియోజకవర్గాల్లో, జగన్ ప్రత్యేక సభలు నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు.

మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత, బీజేపీ నేతలు కలిసి ఉమ్మడి సభలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రస్తుతం జగన్ సర్కార్ ఇస్తున్న సంక్షేమాలకంటే దాదాపు రెట్టింపు స్థాయిలో పథకాలు అమలు చేస్తామని చెబుతున్నారు! వాలంటీర్లకూ జీతాలు పెంచుతామని వెల్లడిస్తూ ప్రచారాలు చేస్తున్నారు. కూటమికి మద్దతు తెలిపాలని కోరుతున్నారు!

ఇక తెలంగాణ విషయానికొస్తే... ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తాచాటాలని బలంగా భావిస్తుండగా.. బీజేపీ నేతలు వారి వారి ప్రయత్నాల్లో వారున్నారు! మరోపక్క అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బకు లోక్ సభ ఎన్నికల ఫలితాలతో మందు రాయాలని.. ఫలితంగా గట్టిగా నిలబడాలని, కేడర్ లో కొత్త ఉత్సాహం నింపాలని భావిస్తుందని తెలుస్తుంది! దీంతో... తెలంగాణలో కూడా ప్రచార పర్వాలు పీక్స్ కి చేరుతున్నాయి!

ఇలా ఎవరి ప్రచారాలతో వారు బిజీగా ఉన్నా... ఓటరు మదిలో ఏమి ఉందనేది ఆసక్తిగా మారింది. ప్రధానంగా.. ఏపీలో మరోసారి జగన్ ప్రభుత్వానికే పట్టం కడతారా.. లేక, 2014 తరహా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటారా అనేది ఆసక్తిగా మారింది!