Begin typing your search above and press return to search.

రండి వ‌చ్చేయండి.. శామ్ అల్ట‌మాన్‌కు ఏఐ బోర్డు విన్న‌పాలు!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌, చాట్ జీపీటీ సంస్థ సీఈవోగా ఉన్న శామ్ అల్ట‌మాన్‌ను ఇటీవ‌ల ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించిన ఏఐ బోర్డు.. ఇప్పుడు ప‌దే ప‌దే ఆయ‌న‌ను ఆహ్వాస్తోంది

By:  Tupaki Desk   |   19 Nov 2023 8:18 AM GMT
రండి వ‌చ్చేయండి.. శామ్ అల్ట‌మాన్‌కు ఏఐ బోర్డు విన్న‌పాలు!
X

ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌, చాట్ జీపీటీ సంస్థ సీఈవోగా ఉన్న శామ్ అల్ట‌మాన్‌ను ఇటీవ‌ల ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించిన ఏఐ బోర్డు.. ఇప్పుడు ప‌దే ప‌దే ఆయ‌న‌ను ఆహ్వాస్తోంది. రండి.. మ‌ళ్లీ వ‌చ్చేయండి! అంటూ.. ఆయ‌న‌కు వ‌ర్త‌మాలు పంపుతోంది. శామ్ అంశాన్ని బోర్డు మీటింగుల్లో ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్నారు కూడా.

సామ్ ఆల్ట్‌మన్‌ను ఆక‌స్మికంగా తొలగించిన తర్వాత బోర్డు ఇప్పుడు కంపెనీకి తిరిగి రావాలంటూ.. ఆయ‌న తో చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. దీనికి సంబంధించి ఆల్ట్మాన్ మాత్రం సందిగ్థ‌త వ్య‌క్తం చేస్తున్న‌ట్టు స‌మాచారం. వీడియో కాల్ ద్వారా ఆయ‌న బోర్డు స‌భ్యుల‌తో మాట్లాడార‌ని తెలిసింది. తాను తిరిగి రావాలంటే.. సంస్థ‌లో కీలకమైన పాలనా మార్పులను కోరుకుంటున్న‌ట్టు తెలిసింది.

ఆల్ట్‌మ‌న్ స‌న్నిహిత వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు.. ఆల్ట్‌మ‌న్ స‌హా గెర్జ్ బ్రాక్‌మ‌న్‌(ఓపెన్ ఏఐ అధ్య‌క్షుడు, స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు)ను తిరిగి ఆహ్వానించేందుకు బోర్డు స‌భ్యులు సిద్ధంగానే ఉన్నార‌ని తెలిపారు. దీనికి కార‌ణం.. ఆల్ట్‌మ‌న్‌ను తొల‌గించిన త‌ర్వాత‌.. మ‌రింత మంది సిబ్బంది కూడా రిజైన్ చేసేందుకు సిద్ధ‌ప‌డ‌డ‌మేన‌ని తెలిపారు. రేపు ఒక వేళ ఆల్ట్‌మ‌న్ సొంత‌గా ఒక కంపెనీని ప్రారంభించిన నేప‌థ్యంలో ఈ ఉద్యోగులంతా ఆయ‌న వెంట న‌డిచేందుకు సిద్ధంగా ఉన్నార‌ని.. ఓ నివేదిక స్ప‌ష్టం చేసింది.

ఆల్ట్‌మ‌న్‌, బ్రాక్‌మ‌న్ రిజైన్ చేసిన త‌ర్వాత‌.. క‌నీసం ముగ్గురు సీనియ‌ర్ రిసెర్చ్ స్కాల‌ర్లు రాజీనామా చేశార‌ని.. మ‌రింత ఆఫీసుల‌కు దూరంగా ఉంటున్నార‌ని నివేదిక పేర్కొంది. దీని ప్ర‌కారం.. OpenAI రీసెర్చ్ డైరెక్టర్ జాకుబ్ పచోకీ, AI రిస్క్ ఎవాల్యుయేషన్ హెడ్ అలెగ్జాండర్ మాడ్రీ, సీనియ‌ర్‌ పరిశోధకుడు సిడోర్ ఇప్ప‌టికే నిష్క్రమించారు.

ఆల్ట్‌మాన్ బహిష్కరణ తర్వాత కొంతమంది ఉద్యోగులు కూడా సంస్థ‌కు రిజైన్ చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం.. బోర్డును నిరుత్సాహానికి గురిచేసింది. AI 'భద్రత' పద్ధతుల గురించి చాట్‌జిపిటి సృష్టికర్త వద్ద దీర్ఘకాలంగా ప‌నిచేస్తున్న‌వారు ఇలా చేయ‌డంతో సంస్థ ఉక్కిరిబిక్కిరికి గుర‌వుతున్న‌ట్టు నివేదిక స్ప‌ష్టం చేసింది.

OpenAI యొక్క ప్రస్తుత బోర్డులో చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సుత్‌స్కేవర్, Quora CEO ఆడమ్ డి ఏంజెలో, మాజీ జియోసిమ్ సిస్టమ్స్ CEO తాషా మెక్‌కాలీ, జార్జ్‌టౌన్ సెంటర్ ఫర్ సెక్యూరిటీ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీలో స్ట్రాటజీ డైరెక్టర్ హెలెన్ టోనర్ ఉన్నారు. నివేదిక ప్రకారం, ఓపెన్‌ఏఐని సహ-స్థాపన చేసిన సట్స్‌కేవర్, ఆల్ట్‌మన్‌ను తొలగించడంలో కీలక పాత్ర పోషించాడు.