Begin typing your search above and press return to search.

ఆపరేషన్ 3 నెలలు.. దెబ్బకు మటాష్

సర్జరీ అనంతరం ఆరేడు వారాలు కేసీఆర్ కు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు చెబుతున్నారు. అనంతరం.. కోలుకోవటానికి మరో నెలకు పైనే పడుతుందని..

By:  Tupaki Desk   |   10 Dec 2023 4:30 PM GMT
ఆపరేషన్ 3 నెలలు.. దెబ్బకు మటాష్
X

మూడు నెలలు మౌనంగా ఉండండి. జరగాల్సింది జరుగుతుంది. ప్రభుత్వాన్ని నడపలేక చతికలపడటం ఖాయం.. మన చేతికి అధికారం పక్కా అన్న రీతిలో గులాబీ బాస్ అంచనాలు ఉన్నాయంటూ గులాబీ వర్గాల్లో ఒకటే చర్చ జరటం తెలిసిందే. ఇలాంటి వేళ.. వీరి మాటల్ని విన్న పలువురు.. 'అధికారం చేజారి వారం కూడా కాలేదు. అప్పుడే పవర్ గురించి ఇంత తహతహ' అన్న విస్మయాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. మనం ఒకటి తలిస్తే.. కాలం మరొకటి తలిచిందన్నట్లుగా సరికొత్త పరిణాలు చోటు చేసుకుంటున్నాయి.

ఫాంహౌస్ బాత్రూంలో జారి పడటం.. గాయం తీవ్రంగా ఉండటం.. వెంటనే సర్జరీ చేయాల్సి రావటం లాంటి పరిణామాలు వెంట వెంటనే జరిగిపోయాయి. ఇదే క్రమంలో.. అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామంతో కావాల్సినంత సానుభూతిని సొంతం చేసుకోవాలన్న గులాబీ పరివారం ఆరాటం ఇప్పుడు కొత్త సంకటంగా మారిందంటున్నారు. సర్జరీ అనంతరం ఆరేడు వారాలు కేసీఆర్ కు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు చెబుతున్నారు. అనంతరం.. కోలుకోవటానికి మరో నెలకు పైనే పడుతుందని.. కొన్ని సందర్భాల్లో రెండు నెలలకు పైనే పట్టినా ఆశ్చర్యం లేదంటున్నారు.

వయసు ప్రకారం చూసినా.. కేసీఆర్ డెబ్బై దాటిన నేపథ్యంలో ఆయన కోలుకోవటం కాస్తంత ఆలస్యం కావటం ఖాయమని చెబుతున్నారు. ఇలాంటివేళ.. గులాబీ దళం అనుకున్న ఆపరేషన్ 3 నెలలు వర్కువుట్ అయ్యే అవకాశం లేదంటున్నారు. దీనికి తోడు.. గడిచిన రెండు రోజులుగా విడుదలై వైరల్ గా మారిన వీడియోలు గులాబీ ఆశల్ని పూర్తిగా చదిమేలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ అనారోగ్యం భావోద్వేగాన్ని రగిలిస్తుందని.. సానుభూతిని పెంచుతుందన్న అంచనాలకు భిన్నంగా.. ఇలాంటి వేళ.. కేసీఆర్ ఏం చేయగలరు? ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

గులాబీ దళం ఒకటి తలిస్తే.. పరిణామాలు మరోలా మారుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఆరోగ్యం పూర్తిగా సెట్ కావటం.. ఆయన మునుపటి మాదిరి ఉత్సాహంగా మారటం ముఖ్యమంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే తప్పుల కంటే కూడా తమ బిగ్ బాస్ ఆరోగ్యాన్ని సెట్ చేసుకోవాల్సిన టాస్కే ఎక్కువని చెబుతున్నారు. కేసీఆర్ కాకుండా మరెవరినీ గులాబీ బాస్ గా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఓకే అనే పరిస్థితి లేదంటున్నారు. ఇప్పటికే లోలోపల ఉన్న గ్రూపులు బయటకు కనిపించకుండా కేసీఆర్ భయం పని చేస్తుందని.. అలాంటిది ఆయన అనారోగ్యంగా ఉన్న వేళలో కుర్చీ పోరుకు దిగితే.. ఒక వర్గం మరో వర్గాన్ని నిలువరిస్తుందని చెబుతున్నారు. మొత్తంగా.. రేవంత్ సర్కారుకు ఇప్పట్లో ఢోకా లేదంటున్నారు. మొదట్లో అనుకున్నట్లుగా మూడు నెలల్లో ప్రభుత్వాన్ని పడేయటం తర్వాత సంగతి.. గులాబీ కోటకు అసంత్రప్తి బీటలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.