'గీత'ను తప్పుగా అర్థం చేసుకున్న అణుబాంబ్ పితామహుడు!
సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త జె రాబర్ట్ ఓపెన్ హైమర్ కు భగవద్గీత పై ఉన్న ఆకర్షణ గురించి మాట్లాడారు.
By: Tupaki Desk | 21 July 2023 2:26 PM GMTభారతీయ పౌరాణిక కథలను తన రచనలతో ప్రజలకు మరింత చేరువగా తెచ్చిన భారతీయ రచయిత దేవదత్ పట్నాయక్. క్రిస్టోఫర్ నోలన్ ఓపెన్ హైమర్ చిత్రం విడుదలకు ముందు సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త జె రాబర్ట్ ఓపెన్ హైమర్ కు భగవద్గీత పై ఉన్న ఆకర్షణ గురించి మాట్లాడారు. ప్రపంచంలోని మొట్టమొదటి అణు బాంబు సృష్టికి దారితీసిన ట్రినిటీ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన తర్వాత ఓపెన్ హైమర్ `గీత`లోని ఒక కోట్ గురించి తీవ్రంగా ఆలోచించాడు.
1945లో న్యూ మెక్సికోలో అణుబాంబు పరీక్షను విజయవంతంగా నిర్వహించినప్పుడు ``వెయ్యి సూర్యుల తేజస్సు ఆకాశంలోకి విరజిమ్మితే అది మహాశక్తిమంతుడి వైభవంలా ఉంటుంది.. నేను మృత్యువును.. ప్రపంచాన్ని నాశనం చేసేవాడిని`` అని ఓపెన్ హైమర్ అనుకున్నాడు. అతను ప్రారంభంలో సైంటిస్టుగా విజయాన్ని సాధించాడు. తరువాత అతను హిరోషిమా - నాగాసాకి నగరాలపై బాంబు దాడి చేయడాన్ని చూసాక చలించిపోయాడు. తరువాత మనసు మార్చుకున్నాడు. నా చేతుల్లో రక్తం ఉంది అంటూ చాలా మదనపడ్డాడు.
ప్రముఖ జాతీయ మీడియాతో పట్నాయక్ మాట్లాడుతూ.. ఒపెన్ హైమర్ `గీత` నుండి కోట్ చేసిన వాటిని పరిశీలించే ప్రయత్నం చేసానని అన్నారు. ఆ కోట్ గురించి తనకు పూర్తిగా తెలియకపోవడంతో అతడు(ఓపెన్ హైమర్) స్టంప్ అయ్యానని చెప్పాడు. ``నేను ఒపెన్ హైమర్ పై కొంత పరిశోధన చేసాను. నేను ఈ లైన్ ను ఆయన నుంచి ఎప్పుడూ వినలేదు. ఇది భగవద్గీతలో 11వ అధ్యాయం 32వ శ్లోకం అని ఎవరో చెప్పారు. ఆ లైన్ `కాల్-అస్మి` అని చెబుతుంది. అంటే ``నేను టైమ్ ని... ప్రపంచాన్ని నాశనం చేసేవాడిని`` అని అర్థం. కాబట్టి ఓపెన్ హైమర్ అర్థం చేసుకున్నది తప్పు. ఇది ``నేను మరణం కాదు. ``ఇది సమయం... సమయాన్ని నాశనం చేసేవాడు`` అని గీతలోని ఆ పంక్తి అర్థం... అని విశ్లేషించారు.
నేను చూసిన వీడియోలో ``నేను మరణం.., నేనే మరణం`` అని చెప్పుకుంటూ ఉంటాడు. ఓపెన్ హైమర్ ఏదో ఒక రకమైన ఆధ్యాత్మిక నేపథ్యం నుండి మరణాన్ని విధ్వంసాన్ని చూస్తున్నందున ఉత్సాహంగా ఉంటాడు. క్రైస్తవ నేపథ్యం ఉన్న సైంటిస్ట్ ఆయన. నిజానికి క్రైస్తవంలో దేవుడు వరదలు అగ్నిప్రమాదాలతో ప్రజలను శిక్షిస్తాడని అంటారు. హింసతో మానవాళిని చంపే ఈ చర్య బైబిల్ సంప్రదాయాలలో చాలా భాగం. ఇది హిందూ సంప్రదాయాలలో భాగం కాదు. జైన లేదా బౌద్ధ సంప్రదాయాలలో భాగం కాదు.. ఓపెన్ హైమర్ పలికిన ఆ సంభాషణ చాలా నాటకీయంగా అనిపిస్తుంది... అని విశ్లేషించారు.
అణుబాంబ్ ని పరీక్షించినప్పుడు ఓపెన్ హైమర్ నైతిక సందిగ్ధత లో ఉండే అవకాశం ఉందని.. మత గ్రంథాలను విభిన్నంగా వివరించే చరిత్ర మానవాళికి ఉందని పట్నానాయక్ అన్నారు. ``బహుశా అణుబాంబు తయారీలో అతని(ఓపెన్ హైమర్) బృందంలో ఒక భారతీయుడు ఉండవచ్చు. అతడు గీతను చదవాలని ఓపెన్ హైమర్ కి సూచించాడు`` అని పట్నానాయక్ ఊహించారు. ఓపెన్ హైమర్ ఆ పంక్తులను పలికేవాడో లేదో తనకు తెలియదని చెప్పాడు.
నిజానికి ఒపెన్ హైమర్ కేవలం గీత మాత్రమే కాకుండా.. కాళిదాసు మేఘదూత కూడా చదివాడు. ఈ గ్రంథాలను వాటి ఒరిజినల్ రూపంలో చదవడానికి అతను సంస్కృతం కూడా నేర్చుకున్నాడు. నోలన్ చిత్రంలో సిలియన్ మర్ఫీ అతని పాత్రను పోషించాడు. మర్ఫీ తన పరిశోధనలో భాగంగా గీతను కూడా చదివాడు అని జర్నలిస్ట్ సుచరితి త్యాగి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. భగవద్గీతలో ఒక పంక్తిని తప్పుగా అనువదించి ఓపెన్ హైమర్ తప్పుగా అర్థం చేసుకున్నాడని రచయిత దేవదత్ పట్నాయక్ అన్నారు.