Begin typing your search above and press return to search.

షాకింగ్ రిపోర్ట్... 450 మంది రక్షణలో బిన్ లాడెన్ కుమారుడు!

దీంతో... ఈ వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   14 Sep 2024 3:00 AM GMT
షాకింగ్  రిపోర్ట్... 450 మంది రక్షణలో  బిన్  లాడెన్  కుమారుడు!
X

తాజాగా ఇంటర్నేషనల్ మీడియా ఓ సంచలన విషయాన్ని వెల్లడించింది. ఇందులో భాగంగా... ఆల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడేన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ సజీవంగా ఉన్నాదని, ఇప్పుడు ఆ ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తున్నాడని "ది మిర్రర్" నివేదించింది! దీంతో... ఈ వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా మరికొన్ని కథనాలు తెరపైకి వచ్చాయి.

అవును... ఒసామా బిన్ లాడేన్ కుమారుడు హంజా బ్రతికే ఉన్నాడంటూ ది మిర్రర్ నివేదించింది! ఈ సందర్భంగా... తన సోదరుడు అబ్దుల్లా బిన్ లాడెన్ తో కలిసి హంజా లాడెన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆల్ ఖైదాను రహస్యంగా నడుపుతున్నాడని బాంబు పేల్చింది! ఇదే సమయంలో... సుమారు 450 మంది స్నిపర్ల నిరంతర రక్షణలో ఉత్తర ఆఫ్ఘన్ లో ఉగ్రవాద యువరాజు అని పిలవబడే వ్యక్తి దాక్కున్నాడని "అవుట్ లెట్" తెలిపింది!

ఇదే సమయంలో 2021 కాబూల్ పతనం నుంచి ఆఫ్ఘనిస్థాన్ వివిధ ఉగ్రవాద గ్రూపులకు శిక్షణా కేంద్రంగా మారిందని ‘ది ఇంటర్నేషనల్ మొబలైజేషన్ ఫ్రంట్’ (ఐ.ఎం.ఎఫ్) వెల్లడించింది. ఈ క్రమంలో హంజా ఇప్పుడు దారా అబ్ధుల్లా ఖేల్ జిల్లాలో ఉన్నాడని.. అక్కడ 450 మంది అరబ్బులు, పాకిస్థానీలు అతనికి రక్షణ కల్పిస్తున్నారని.. భవిష్యత్తులో పలు విదేశీ లక్ష్యాలపై దాడులకు సిద్ధమవుతోందని ఐ.ఎం.ఎఫ్. హెచ్చరించింది.

వాస్తవానికి హంజా బిన్ లాడెన్ మృతి చెందినట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. ఐ.ఎం.ఎఫ్. కూడా ఈ విషయాన్ని వెల్లడించినట్లు కథనాలొచ్చాయి! అయితే అమెరికా మాత్రం... హంజా సౌదీ అరేబియాలోని జెడ్డాలో జన్మించాడని, తర్వాత కాలంలో ఇరాన్ లో తన తల్లితో గడిపాడని చెబుతూ... అతడినీ ‘గ్లోబల్ టెర్రరిస్ట్’ గా గుర్తించింది.

కాగా ఒసామా బిన్ లాడేన్ ను 2011లో పాకిస్థాన్ లోని అభోటాబాద్ లో అమెరికా ప్రత్యేక దళాలు హతమార్చిన సంగతి తెలిసిందే. ఆ ఆపరేషన్ కు సంబంధించిన దృశ్యాలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంటాయి. 11 సెప్టెంబర్ 2001 (9/11 అటాక్) న యూఎస్ లో చేసిన దారుణ దాడిని లాడేన్ అంగీకరించాడు! ఈ ఘటనలో సుమారు 3,000 మంది మరణించారు.