Begin typing your search above and press return to search.

టీడీపీని భయపెట్టే జోస్యం చెబుతున్న సొంత ఎంపీ...!

ఎందుకంటే మరో అయిదేళ్ల సుదీర్ఘ కాలం అంటే టీడీపీ అన్ని విధాలుగా తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   18 Jan 2024 3:48 PM GMT
టీడీపీని భయపెట్టే జోస్యం చెబుతున్న సొంత ఎంపీ...!
X

తెలుగుదేశం పార్టీకి ఈసారి ఎన్నికలు నిజంగా లైఫ్ అండ్ డెత్. ఆ విషయం చెప్పడానికి ఏ రాజకీయ విశ్లేషకుడూ అవసరం లేదు. ఈసారి రాకపోతే ఓడిపోతే ఏమి జరుగుతుంది అంటే వెరీ సింపుల్. 2029 ఎన్నికల వరకూ వెయిట్ చేయడం. అంతవరకూ వెయిట్ చేసే సీన్ టీడీపీ ఉందా లేదా అన్నదే ఇక్కడ పాయింట్. ఎందుకంటే మరో అయిదేళ్ల సుదీర్ఘ కాలం అంటే టీడీపీ అన్ని విధాలుగా తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది.

ఈ నేపధ్యంలో నుంచి చూసినపుడు టీడీపీ గట్టిగానే పోరాడుతోంది. గ్రౌండ్ లెవెల్ లో ఎలా ఉన్నా చంద్రబాబు అయితే ఎక్కడికక్కడ సభలు పెట్టి పంచ్ డైలాగులతో హోరెత్తిస్తున్నారు అయితే ఆ పార్టీకి రెబెల్ గే మారిన కేశినేని నాని అయితే టీడీపీకి సీన్ లేదు అని బాంబు లాంటి వార్తను పేలుస్తున్నారు.

అంతే కాదు చంద్రబాబు తల్లకిందులుగా తప్పస్సు చేసినా వచ్చే ఎన్నికల్లో గెలిచేది ఉండదని భయం కలిగించే జోస్యం చెబుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీకి ఇవే ఆఖరు ఎన్నికలు అని కూడా అంటున్నారు. ఆయన మరో మాట అంటున్నారు. చంద్రబాబు రాజకీయ జీవితాన్ని నారా లోకేష్ రాజకీయ సమాధి చేసారు అని. అంటే చంద్రబాబు పుత్రప్రేమలో పడిపోయి పార్టీని దానికి బలిగా పెడుతున్నారు అన్నది కేశినేని నాని ఘాటు విమర్శ అన్న మాట.

కేవలం కొడుకు కోసమే పార్టీని దాని ప్రయోజనాన్ని ఫణంగా పెట్టి చంద్రబాబు టీడీపీతో రాజకీయ జూదం ఆడుతున్నారని కేశినేని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీకి నలభై సీట్లు వస్తే గొప్పే అని నంబర్ కూడా చెప్పి మరీ తమ్ముళ్లకు బీపీ పెంచేశారు.

ఇక వై నాట్ పులివెందుల అంటున్న బాబు ముందు వెళ్ళి తన కుప్పం సీటు చూసుకోవాలని కేశినేని నాని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభించినది స్వర్గీయ వైఎస్సార్ అని, చంద్రబాబు వచ్చాకనే ఆ ప్రాజెక్ట్ పడకేసింది అని కేశినేని అంటున్నారు. ప్రతీ సోమవారం పోలవరం అని అయిదేళ్ల కాలంలో బాబు చేసింది ఏంటి అని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు తన గతాన్ని తన పాలనను మరచి ఆరోపణలు చేస్తున్నారని కానీ జనాలకు అన్నీ తెలుసు అని కేశినేని అంటున్నారు. ప్రధాని కావాలని సీఎం కావాలని ఎవరికి అయినా ఉండవచ్చు కానీ కలలు వేరు రియల్ వేరు అని కేశినేని నాని బాగానే సెటైర్లు పేల్చారు. చంద్రబాబు కుప్పం లో ఓటమికి దగ్గరగా ఉన్నారని ఆయన టీడీపీని గెలిపించేది ఏంటి అని కేశినేని గట్టిగానే ఇచ్చేశారు.

తన సొంత నియోజకవర్గం చంద్రగిరిలో పోటీ చేసే సత్తా చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ని 2013 నుంచే టీడీపీ చంద్రబాబు దూరం పెడుతూ వచ్చారని, జూనియర్ ఫ్లెక్సీలు తీయించేమని తనతోనే అప్పట్లో చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఇవన్నీ సరే కానీ టీడీపీని చంద్రబాబుకి ముందే ఓటమి సీన్ చూపించేసే ఎలా అన్నదే చర్చ.