ఆక్సిటోసిన్ హార్మోన్ అలిగి కూర్చుంటుంది... బ్రేకప్ కి సిద్ధం అని చెప్పే సంకేతాలివే!
ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వేలి ముద్రలు ఒకేలా ఉండవని అంటారు.. ఇదే సమయంలో ఏ ఇద్దరి ఆలోచనలూ పూర్తిగా ఒకేలా ఉండే అవకాశం ఉండకపోవచ్చని చెబుతుంటారు.
By: Tupaki Desk | 23 Jan 2025 3:15 AM GMTఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వేలి ముద్రలు ఒకేలా ఉండవని అంటారు.. ఇదే సమయంలో ఏ ఇద్దరి ఆలోచనలూ పూర్తిగా ఒకేలా ఉండే అవకాశం ఉండకపోవచ్చని చెబుతుంటారు. వందల కోట్ల మంది ఉన్న ఈ భూ ప్రపంచంలో ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి అభిరుచులు వారివి. అయితే... ఇలా కలిసినట్లుగా అనిపించే అభిరుచులు, ఆలోచనలు మధ్య ప్రేమ అనే ఆలోచన, అనుభూతి వచ్చి చేరితే అది బంధంగా మారుతుందని అంటారు.
ఆ విధంగా అభిరుచులు, ఆలోచనలు కలిసినట్లుగా ఉన్నా, ఉన్నట్లు భావించినా ఆ బంధం అలానే కంటిన్యూ అవుతుంది. ఒక్కసారి ఇదంతా భ్రమ.. వారి ఆలోచన వేరు, నా ఆలోచన వేరు అని వీరు అనుకుంటే.. వీరి అభిరుచులే వేరు అని వారనుకుంటే.. ఆ బంధానికి బీటలు వారతాయి.. కట్టుకున్న కలల కోటలు కూలిపోతాయి. ఆ సమయంలో భాగస్వామిలో కనిపించే సంకేతాలు ఈ విధంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
అవును... బంధం బాగున్నప్పుడు బాగుంటుంది.. బీటలు మొదలైతేనే భరించలేనంత బాధగా ఉంటుందని అంటారు. ఈ సమయంలో మనస్తత్వవేత్తల అభిప్రాయం ప్రకారం మీతో బంధంలో ఉన్న భాగస్వామి.. ఆ అనుబంధాన్ని ముగించాలి, అక్కడితో ఆపాలని డిసైడ్ అయితే అది ఎలా తెలుస్తుంది అనే విషయాలపై పలు సంకేతాలను తెరపైకి తెచ్చారు! ఈ సందర్భంగా ఆ సంకేతాలు ఏమిటి.. ఎలా మొదలవుతాయి.. అనేది ఇప్పుడు చూద్దామ్..!
భావోద్వేగం మిస్సవ్వడం!:
భాగస్వాములిద్దరూ ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకోవడంలో ఒకరితో ఒకరు నిజంగా ఓపెన్ గా ఉంటే అది చాలా సుఖంగా ఉంటుంది. అలా కాకుండా.. లోతైన చర్చలు సాగించకుండా, సరదా పరిహాసలు లేకుండా, ఆకర్షణీయమైన సంభాషణలు కరువైతే.. ఆ బంధంలో భావోద్వేగం మిస్సవుతుందని, అది బలహీనపడుతుందని అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. పార్ట్ నర్స్ మధ్య స్పార్క్ ముఖ్యం అని చెబుతున్నారు.
కమ్యునికేషన్ విచ్ఛిన్నం!:
మొదటి సమస్య ప్రారంభం అయిన అనంతరం ఈ రెండో సమస్య ఉత్పన్నమవుతుందని అంటారు. భాగస్వామితో మనసు విప్పుకుని మాట్లాడలేని, సరదా సంభాషణలు చేయాలని అనిపించలేని పరిస్థితి వచ్చిన తర్వాత ఆటోమెటిక్ గా వీరిమధ్య ఉన్న కమ్యునికేషన్ విఛిన్నం అవుతుంది. దీనికి పునాధి వేసింది ఎవరో వారి భాగస్వామికి బంధంపై స్పష్టత రావడానికి ఇది రెండో సంకేతం అని అంటున్నారు.
ఘర్షణాత్మక కమ్యునికేషన్!:
రెండో సమస్య ప్రారంభమైన అనంతరం.. కచ్చితంగా మూడో సమస్యకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కచ్చితంగా కమ్యునికేట్ చేసుకోవాల్సిన విషయాలని భాగస్వామి వద్ద ప్రస్థావించినప్పుడు వాదనలు ఆటోమెటిక్ గా మొదలవుతాయని అంటున్నారు. ఒకప్పుడు సరదాగా అనిపించిన విషయాలే.. ఈసారి మరో కోణంలో కనిపిస్తాయి. ఈ సమయంలో ఒకరు ఎడ్డెం అంటే మరొకరు తెడ్డెం అనే పరిస్థితి దాపురిస్తుంది. ఇది ఓ సంకేతం అని అంటున్నారు.
శారీరక సాన్నిహిత్యానికి అప్పీల్ లేదు!:
పై మూడు సమస్యలు మొదలైన అనంతరం శారీరక సాన్నిహిత్యం, లైంగిక కోరికలపై భారీ ప్రభావం చూపిస్తుంది. ఒకప్పటి ప్రేమ రూపంలో ఉన్న శారీరక సాన్నిహిత్య సంబంధం తొలగిపోతుంది. వాస్తవానికి బంధం ధృడంగా ఉండటానికి ఈ సంబంధం చాలా కీలకం. ఈ సమయంలో ఒకరిని ఒకరు తాకడం వల్ల ఉత్పత్తయ్యే ఆక్సిటోసిన్ అనే హార్మోన్లు (లవ్ హార్మోన్) అలిగి కూర్చుంటాయి. ఫలితంగా.. బండి ముందుకు కదలదు!
అపనమ్మకం దావానంలా వ్యాపిస్తుంది!:
పైన చెప్పుకున్న సమస్యలు తెరపైకి వచ్చినప్పటికే బంధం బ్రేకప్ కి సిద్ధంగా ఉందనే సంకేతాలు భాగస్వామి నుంచి వచ్చేసినట్లే అని క్లారిటీ వచ్చిన వేళ.. దానికి మరింత బలం చేకూరుస్తూ అన్నట్లుగా అపనమ్మకం మొదలవుతుంది.. ఇది రోజు రోజుకీ దావానంలా వ్యాపిస్తుంది. ఇది ఈ బంధానికి క్యాన్సర్ లా మారుతుంది. రుజువులు చూపించలేని నమ్మకాలుగా అనుమానాలు జడలు విచ్చుకుంటాయి. ఇది బ్రేకప్ లో కీ రోల్ పోషిస్తుంది.
హీరో హీరోయిన్లు మారిపోతారు!:
ఇలా పైన చెప్పుకున్న సమస్యలు వచ్చిన అనంతరం మానసికంగానో, శారీరకంగానో.. ఊహళ్లో వ్యక్తి మారిపోతారు. ఒకప్పుడు బంధం బలంగా ఉన్నప్పుడు ఆమెకు అతడే హీరో, అతడికి ఆమె హీరోయిన్. అయితే బంధానికి బీటలు మొదలైన అనంతరం... ఫాంటసీలు మారిపోతాయి.. ఊహల్లో వ్యక్తులు మారుతుంతారని చెబుతుంటారు. ఇది పూర్తిగా భాగస్వామి నుంచి దూరం చేస్తుందని అంటారు. ఫలితంగా... భాగస్వామి పక్కనే ఉన్నా.. ఊహల్లో మరో వ్యక్తి కదలాడుతుంటాడు. ఇంతకంటే బలమైన కారణం బ్రేకప్ కి ఉండకపోవచ్చని చెబుతున్నారు!