Begin typing your search above and press return to search.

బాబు మానసపుత్రికగా...సక్సెస్ అయితే తిరుగేలేదుగా !

ఏపీలో జీరో పావర్టీ పీ 4 పేరుతో ఒక కీలక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు వారి సెంటిమెంట్ పండుగ అయిన ఉగాది వేళ ప్రారంభించారు

By:  Tupaki Desk   |   9 April 2025 2:45 AM
Chandrababu’s Ugadi Gift: P4 for a Poverty-Free Andhra
X

ఏపీలో జీరో పావర్టీ పీ 4 పేరుతో ఒక కీలక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు వారి సెంటిమెంట్ పండుగ అయిన ఉగాది వేళ ప్రారంభించారు. పీ 4 అనంది చంద్రబాబు మాసన పుత్రికగా చెప్పుకోవాలి. ఇప్పటికి రెండేళ్ళ క్రితం రాజమండ్రీలో జరిగిన మహానాడులో పీ 4 అని తొలిసారి బాబు చెప్పినప్పుడు ఎవరికీ దాని గురించి పెద్దగా తెలియలేదు.

అయితే ఆ తర్వాత బాబు ఎన్నికల్లోనూ చెబుతూ వచ్చారు. పేదరికం లేని రాష్ట్రంగా మారుస్తామని దాని కోసం సంపన్నుల సహకారం తీసుకుంటామని చెప్పారు. బాగా ఉన్నత స్థాయిలో ఉన్న వారు పేదలను ఆర్ధికంగా ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు.

దానికి స్పందన బాగానే వస్తోంది. అయితే ఇది పై స్థాయిలో కాకుండా దిగువ స్థాయిలో కూడా ఉండేలా బాబు తాజాగా ఒక వ్యవస్థనే డిజైన్ చేశారు. పీ 4 ప్రాజెక్ట్ ని సొసైటీగా ఫార్మ్ చేసారు. దానికి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉంటారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైస్ చైర్మన్ గా ఉంటారు. మిగిలిన వారు అంటే సీఈవో, డైరెక్టర్ వంటి పదవులను కూడా నియమించనున్నారు. అలాగే స్టేట్ లెవెల్ లో ఈ కనెక్షన్ కోసం ఒక కాల్ సెంటర్ ఉంటుంది దానితో పాటు సాంకేతిక బృందం, ప్రోగ్రాం టీమ్, వింగ్ టీమ్ ఇలా చూస్తే ఒక భారీ వ్యవస్థనే ఏర్పాటు చేస్తున్నారు.

అదే జిల్లా స్థాయికి వచ్చేసరికి ఈ సొసైటీకి మంత్రి చైర్మన్ గా ఉంటారు. దానిని జిల్లా చాప్టర్ అని పిలుస్తారు. అసెంబ్లీ స్థాయిలో చాప్టర్ ఏర్పాటు చేయనున్నారు. దానికి ఎమ్మెల్యే చైర్మన్ గా ఉంటారు. ఇక వార్డు గ్రామ స్థాయిలో కూడా చాప్టర్లు ఏర్పాటు చేయనున్నారు. వాటికి చైర్మన్లుగా వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, పంచాయతీ కార్యదర్శి ఉంటారు.

ఇలా గ్రాస్ రూట్ వరకూ ఈ సోసైటీ యాక్టివిటీస్ ని తీసుకుని వెళ్ళకున్నారు. ఈ చాప్టర్లు అన్నీ కూడా మార్గదర్శులను ఏంపిక చేయాలి అంటే సంపన్నులు అన్న మాట. వారు పేదలను దత్తత తీసుకునే విధంగా సుముఖంగా ఉంటే మరో వైపు పేద కుటుంబాలను అనుసంధానం చేస్తారు. వాటిని బంగారు కుటుంబాలు అని పేరు పెట్టారు.

ఇలా ఈ రెండింటినీ అనుసంధానం చేయడం ద్వారా సోసైటీలు వాటి చాప్టర్లు పనిచేయాల్సి ఉంటుంది. మరో వైపు చూస్తే ఈ ఏడాది ఆగస్టు నాటికి ఏకంగా అయిదు లక్షల మంది పేదలను సొసైటీ ద్వరా చేర్పించి వారిని బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇక దాతాలకు ఒక కుటుంబం కాదు కుటుంబాలే దత్తత తీసుకోవచ్చు. అలాగే గ్రామాలు తీసుకోవచ్చు. మండలాలు కూడా తీసుకోవచ్చు వారి వితరణశీలత ఆర్ధిక స్తోమత మాత్రమే ఇక్కడ ప్రమాణంగా ఉంటుంది. ఈ మొత్తం కార్యక్రమం సక్సెస్ రేటు ని వచ్చే ఉగాది నాటికి ఒక ప్రగతి నివేదిక రూపంలో వెల్లడించనున్నారు.

మొత్తానికి పటిష్టమైన వ్యవస్థనే దీని కోసం ఏర్పాటు చేయడం ద్వారా తన పట్టుదల పేదరికం నిర్మూలన విషయంలో ఏమిటో చెప్పేశారు. 2029 నాటికి ఏపీలో పేదరికం లేకుండా చూడాలన్న ఉద్దేశ్యంతో పనిచేస్తున్నట్లుగా బాబు చెప్పారు. మరి బాబు మానస పుత్రిక జీరో పావర్టీ పీ 4 ఏ విధంగా ముందుకు సాగుతుంది అన్నది చూడాల్సి ఉంది.