బ్రేకింగ్... న్యూస్ ఛానల్ ఆఫీసు వద్ద పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్!
తాజాగా హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని ఓ న్యూస్ ఛానల్ ఆఫీసులో ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వెళ్తున్న సమయంలో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు
By: Tupaki Desk | 13 Jan 2025 8:55 PM GMTబీఆరెస్స్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని ఓ న్యూస్ ఛానల్ ఆఫీసులో ఇంటర్వ్యూ ఇచ్చి బయటకు వెళ్తున్న సమయంలో కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అదుపులోకి తీసుకున్న అనంతరం ఆయనను పోలీసులు కరీంనగర్ కు తరలించినట్లు చెబుతున్నారు.
అవును... బీఅరెస్స్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తో పాడి కౌశిక్ రెడ్డి గొడవపడిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ సమావేశంలో సంజయ్ మాట్లాడుతున్న సమయంలో కల్పించుకున్న కౌశిక్ రెడ్డి అడ్డు తగిలారు. ఈ సమయంలో సంజయ్ ని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి కామెంట్లు చేయడం.. దీంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోవడం తెలిసిందే. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సమక్షంలోనే ఈ రబస జరగడం గమనార్హం.
ఈ నేపథ్యంలో.. బీఆరెస్స్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్... తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా... తాను ప్రజా సమస్యలపై మాట్లాడుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారని.. అతడిపై చర్యలు తీసుకోవాలని కౌశిక్ రెడ్డి తెలిపారు.
మరోపక్క కౌశిక్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా టిక్కెట్ ధరలను పెంచడంపట్ల సీఎం రేవంత్ రెడ్డిపై అతడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.