Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా వాడకంపై ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన గవర్నమెంట్!

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్ది ప్రపంచంలో దీని వాడుక విపరీతంగా పెరిగిపోయింది.

By:  Tupaki Desk   |   4 Sep 2024 9:30 AM GMT
సోషల్ మీడియా వాడకంపై ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన గవర్నమెంట్!
X

టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్ది ప్రపంచంలో దీని వాడుక విపరీతంగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న విషయం ప్రపంచానికి తెలుస్తోంది. అయితే కొన్ని దేశాలలో సోషల్ మీడియా వాడకంపై నిషేధాలు ఉన్నాయి అన్న విషయం మీకు తెలుసా? ఇప్పుడు ఆదేశాల జాబితాలో సరికొత్తగా పాకిస్తాన్ కూడా చేరిపోయింది.

సోషల్ మీడియా లేకుండా ఒక్క క్షణం కూడా గడవలేని జనరేషన్ ఉండి పీరియడ్లో అసలు సోషల్ మీడియా వాడకూడదు అని నిబంధనలు పెడుతున్నాయి కొన్ని దేశాలు. తాజాగా పాకిస్తాన్ దేశంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు విధించింది.షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి నూతన ఉత్తరవులను జారీ చేసింది. ప్రస్తుతం ఈ విషయం సర్వత్రా చర్చనీయాంసంగా మారింది.

కొత్తగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ ను ప్రభుత్వ అనుమతి లేకుండా ఉపయోగించడానికి కుదరదు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని కోపంగా ఉంచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

అంటే ఇక నుంచి పాకిస్తాన్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి ప్రభుత్వ అధికారిక సమాచారం, పత్రాలు బయటకు లీక్ చేయడానికి వీలు లేకుండా ఈ నిధులు విధించారు. ఎవరైనా సోషల్ మీడియా ఉపయోగించాలి అంటే కచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పాక్ జారీ చేసిన అధికారిక ఉత్తర్వుల ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా రూల్స్ 1964 ప్రకారం నడుచు కోవాల్సి ఉంటుంది.

అంటే ఇకపై పాకిస్తాన్ లో ప్రభుత్వ ఉద్యోగులకు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా.. ప్రభుత్వ నిర్ణయాలను, ప్రతిష్ట ను భంగపరిచే విధంగా ప్రకటనలు చేయకూడదు. పొరపాటున ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారికి కఠిన శిక్ష తప్పదు. అయితే ఇటువంటి నిర్ణయాలు ప్రజల స్వేచ్ఛను హరిస్తాయి అని అందరూ భావిస్తున్నారు.