పాకిస్తాన్ స్టేడియంలో ఇండియా జెండా ప్రదర్శించాడని అరెస్ట్
అందుకే మన పొడగిట్టని పాకిస్తాన్ లో ఓ పాకిస్తానీ ఏకంగా ఇండియా జెండా పట్టుకుంటే ఊరుకుంటారా? ఏకంగా అరెస్ట్ చేసి లోపలేశారు.
By: Tupaki Desk | 25 Feb 2025 3:30 PM GMTఅసలే కరుడుగట్టిన పాకిస్తాన్ దేశం. అందులోనూ భారత్ అంటే నిలువెల్ల విషం. అందుకే మన పొడగిట్టని పాకిస్తాన్ లో ఓ పాకిస్తానీ ఏకంగా ఇండియా జెండా పట్టుకుంటే ఊరుకుంటారా? ఏకంగా అరెస్ట్ చేసి లోపలేశారు. ఇప్పుడీ ఘటన సంచలనమైంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఫిబ్రవరి 22న పాకిస్థాన్‌లోని లాహోర్ స్టేడియంలో జరిగిన ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ మ్యాచ్ సందర్భంగా ఒక వ్యక్తి ఇండియా జెండాతో సందడి చేశాడు. దీనితో స్టేడియంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.
ఆయా దేశాల జెండాలు కాకుండా భారతదేశ త్రివర్ణ పతాకాన్ని తీసుకురావడంతో అధికారులు తీవ్రంగా స్పందించారు. ఆ వ్యక్తి వద్ద నుండి జెండాను లాక్కొని, అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- స్టేడియంలో హైఅలర్ట్!
ఈ ఘటన జరగడంతో స్టేడియంలో భద్రతా సిబ్బంది మరింత కట్టుదిట్టం చేశారు. స్టేడియంలో అనుమతించబడిన జెండాలు మాత్రమే ప్రదర్శించాల్సిన నిబంధన ఉండగా విదేశీ జెండా ప్రదర్శన చేయడం అధికారులకు ఆగ్రహాన్ని కలిగించింది.
- సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఇది అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ అని.. ప్రతి దేశ అభిమానులకు తమ జెండాను ప్రదర్శించే హక్కు ఉండాలని చెబుతున్నారు. మరికొందరు, ఆ దేశ నియమాలను గౌరవించాలని అంటున్నారు.
క్రికెట్ అభిమానులు ఈ ఘటనపై చర్చించుకుంటున్నారు. మత అహంకార పాకిస్థాన్‌లో భారత జెండా ప్రదర్శన చేయడంపై అధికారులు కఠినంగా వ్యవహరించడంతో పాటు భద్రతా నియమాలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.