Begin typing your search above and press return to search.

బంగ్లా అల్లర్ల వెనుక పాకిస్థాన్..? భారత ప్రభుత్వ అనుమానం.. బలమైనదే..

భారత్ లో కాంగ్రెస్, బీజేపీ తరహాలో బంగ్లాదేశ్ లో రెండు బలమైన పార్టీలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   6 Aug 2024 10:27 AM GMT
బంగ్లా అల్లర్ల వెనుక పాకిస్థాన్..? భారత ప్రభుత్వ అనుమానం.. బలమైనదే..
X

భారత్ లో కాంగ్రెస్, బీజేపీ తరహాలో బంగ్లాదేశ్ లో రెండు బలమైన పార్టీలు ఉన్నాయి. అవే అవామీ లీగ్, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ). వీటిలో బీఎన్పీ మాజీ ప్రధాని ఖలీదా జియాకు చెందినది. అవామీ లీగ్ షేక్ హసీనా పార్టీ. అయితే.. ఖలీదా ఫక్తు భారత్ వ్యతిరేకి. అదే సమయంలో హసీనా మాత్రం మోదీ ప్రభుత్వంతోనే కాక.. భారత్ లోని అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు. చైనాతోనే కాదు రష్యాతోనూ సంబంధాలు ఏర్పరుచుకున్నారు. మరీ ముఖ్యంగా భారత్ తో అయితే బలమైన బంధమే ఉంది. కానీ, ఇది కొన్ని దేశాలకు గిట్టినట్లు లేదు.

రెచ్చగొట్టింది పాక్ మంత్రి..

బంగ్లాదేశ్ పరిణామాలపై మంగళవారం కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో ప్రధాని మోదీ, హోం, రక్షణ శాఖ మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్, విదేశాంగ మంత్రి జై శంకర్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమికి చెందిన కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జైశంకర్ బంగ్లాదేశ్ లోని పరిస్థితులను వివరించారు. అక్కడి పరిణామాలను క్రమ పద్ధతిలో వివరించారు. అంతా జాగ్రత్తగా గమనిస్తున్నట్లుగానూ చెప్పింది.

రాహుల్ ప్రశ్నకు జైశంకర్ జవాబు..

సభ్యులకు బంగ్లా పరిస్థితిని వివరిస్తున్న క్రమంలోనే రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు జైశంకర్ జవాబిచ్చారు. పాకిస్థాన్ పాత్రపై సందేహాలు వ్యక్తం చేశారు. అల్లర్ల వెనుక కారణాల గురించి చెబుతూ.. విదేశీ శక్తుల ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం చేశారు.బంగ్లాలో అల్లర్లకు మద్దతునిచ్చేలా పాకిస్థాన్ మంత్రి సోషల్ మీడియా ప్రొఫైల్ ఫొటో పెట్టడాన్ని గుర్తుచేశారు. అయితే, దీనిపై పూర్తి ఆధారాలు లేనందున విదేశీ కుట్రను నిర్ధారించలేమని చెప్పారు. వేచిచూడడం మన దేశ విధానంగా చెప్పారు. ఎలాంటి పరిణామాలను అయినా ఎదుర్కొనేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందన్నారు.

కేంద్రానికి ప్రతిపక్షం అండ

అఖిలపక్ష భేటీకి హాజరైన పార్టీలు.. కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపాయి. ప్రభుత్వ నిర్ణయాలను ఏకగ్రీవంగా సమర్ధించాయి. దీన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు. ఏకగ్రీవంగా మద్దతిచ్చిన విపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, శరణార్థిగా వచ్చిన షేక్ హసీనా విషయంలో ఏం చేయాలన్న దానిపైనా వేచి చూద్దామనే ధోరణిలోని కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.