Begin typing your search above and press return to search.

పిల్లులను నియమించుకుంటున్న పాక్... బడ్జెట్ లో కేటాయింపులు!

పాకిస్థాన్ కు ఇప్పటికే ఉన్న ఎన్నో కష్టాలతో పాటు, ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులతో పాటు ఇప్పుడు మరోకొత్త కష్టం వచ్చిపడిందంట

By:  Tupaki Desk   |   20 Aug 2024 7:30 AM GMT
పిల్లులను నియమించుకుంటున్న పాక్... బడ్జెట్ లో కేటాయింపులు!
X

పాకిస్థాన్ కు ఇప్పటికే ఉన్న ఎన్నో కష్టాలతో పాటు, ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులతో పాటు ఇప్పుడు మరోకొత్త కష్టం వచ్చిపడిందంట. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం తాజాగా బడ్జెట్ లో కేటాయింపులూ చేసింది. ఇంతకూ ఆ కష్టం ఏమిటంటే.. పార్లమెంట్ హౌస్ లో ఎలుకల బెడద.

అవును... పాకిస్థాన్ కు ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడిందంట. ఇందులో భాగంగా పాకిస్థాన్ పౌర సంస్థ, క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ (సీడీఏ), పార్లమెంట్ హౌస్ లో ఎలుకలు విధ్వంసం సృష్టిస్తున్నాయంట. దీంతో... ఎలుకలను పట్టుకొవడానికి వేట పిల్లులను నియమించనున్నట్లు ప్రభుత్వం నిర్ణయించుకుందంట.

దీనికోసం పెస్ట్ కంట్రోల్ ఎక్సర్ సైజ్ కోసం 1.2 మిలియన్లు (రూ.12 లక్షలు) కేటాయించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. భవనంలో సమస్యాత్మక క్షీరదాల ఉనికి కారణంగా ఈ బడ్జెట్ కేటాయించబడిందని నివేధిక హైలైట్ చేసింది. ఇదే సమయంలో... ఎలుకలను వేటాడెందుకు పిల్లులను నియమించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.

ఈ నేపథ్యంలో... ప్రత్యేక మెష్ ట్రాప్ లను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపింది. పాకిస్థాన్ పార్లమెంట్ లోపల ఎలుకలు పాకిస్థానీ సెనేట్, పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ లోని వివిధ విభాగాలను దెబ్బతీశాయని చెప్పబడింది. ఇదే క్రమంలో... పార్లమెంట్ లోని పలు ఆఫీసుల్లోని ఫైళ్లను ఎలుకలు కొరికేశాయని పార్లమెంట్ అధికారులు తెలిపారు.