బాగా చలిగా ఉంది.. ఎన్నికల్ని వాయిదా వేయాలని తేల్చేశారు
ఏమైనా చేయొచ్చు. మరేదైనా జరగొచ్చన్నట్లుగా ఉండే పాకిస్థాన్ లో.. దానికున్న ఇమేజ్ కు తగ్గట్లుగా తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 6 Jan 2024 5:35 AM GMTఏమైనా చేయొచ్చు. మరేదైనా జరగొచ్చన్నట్లుగా ఉండే పాకిస్థాన్ లో.. దానికున్న ఇమేజ్ కు తగ్గట్లుగా తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బాగా చలిగా ఉందని.. అందుకు ఫిబ్రవరి 8న జరగాల్సిన పార్లమెంట్ ఎన్నికల్ని వాయిదా వేయాలన్న తీర్మానాన్ని ఆమోదించిన వైనం ఆసక్తికరంగా మారింది. చలి ఎక్కువగా ఉండటంతో పాటు భద్రతా సమస్యలు ఏర్పడినందున ఎన్నికల్ని వాయిదా వేయాలన్న తీర్మానాన్ని పాక్ ఎగువ సభ సెనెట్ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
వంద మంది సభ్యులు ఉండే సభకు కేవలం పద్నాలుగు మంది మాత్రమే ఓటింగ్ కు హాజరయ్యారు. స్వతంత్ర సెనెటర్ దిలావర్ ఖాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా.. మిగిలిన సభ్యులంతా ఓకే చేయటంతో ఈ వింత తీర్మానం ఆమోదించినట్లుగా సభాపతి ప్రకటించారు.అయితే.. ఇది రాజ్యాంగ విరుద్దమని పాలక పార్టీ పాకిస్థాన్ ముస్లింలీగ్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి.
ఆసక్తికరమైన అంశం ఏమంటే.. సెనెట్ నిర్ణయాన్ని పాక్ ఎన్నికల సంఘం సైతం నో చెప్పేసింది. ఆమోద ముద్ర పడిన తీర్మానాన్ని వ్యతిరేకించి.. పార్లమెంటు ఎన్నికల్నిముందుగా అనుకున్న ఫిబ్రవరి 8నే జరుగుతాయని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 8న ఎన్నికల్ని నిర్వహించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేసిన ఎన్నికల సంఘం.. సు్ప్రీం ఆదేశాలులేకుండా ఎన్నికల తేదీల్ని మార్చే అవకాశమే లేదని స్పష్టం చేసింది. ఏమైనా సిత్ర విచిత్రాలు చోటు చేసుకోవటం పాకిస్థాన్ తర్వాతేనని చెప్పక తప్పదు.