వీడియో: పేరు మర్చిపోయిన ఫోటోగ్రాఫర్‌పై స్టార్‌కిడ్ చిరాకు పరాకు
సెలబ్రిటీలతో ఫోటోగ్రాఫర్ల సరదా పరాచికాలు వృత్తిలో ఒక భాగం. విమానాశ్రయాలు, స్టూడియోల వద్ద పడిగాపులు పడి తమ కోసం గంటల తరబడి వెయిట్ చేసే ఫోటోగ్రాఫర్లను వీలున్నంత మర్యాదగానే ట్రీట్ చేస్తారు కథానాయికలు.
By: Tupaki Desk | 29 March 2025 3:52 AMసెలబ్రిటీలతో ఫోటోగ్రాఫర్ల సరదా పరాచికాలు వృత్తిలో ఒక భాగం. విమానాశ్రయాలు, స్టూడియోల వద్ద పడిగాపులు పడి తమ కోసం గంటల తరబడి వెయిట్ చేసే ఫోటోగ్రాఫర్లను వీలున్నంత మర్యాదగానే ట్రీట్ చేస్తారు కథానాయికలు. అయితే ఫోటోగ్రాఫర్లలో అప్పుడప్పుడు కొంటెతనం బయటపడుతుంటుంది. యువకథానాయికలతో పరాచికాలు ఆడుతూ ఏడిపిస్తూ సరదాగా మాట్లాడే కొంటె బాబులు కొందరు ఉంటారు.
అలాంటి ఒక కొంటె బాబు నటవారసురాలు పాలక్ తివారీని చిన్నగా ఆటపట్టిస్తూ కనిపించాడు. అతడి పరాచికానికి చికాగ్గా స్పందిస్తూ.. `ఐసే క్యు బోల్తే హో?` అని పాలక్ తివారీ ముఖాన్ని అదోలా పెట్టింది. ముంబై విమానాశ్రయంలో ఆమెను అనన్య పాండే అని ఫోటోగ్రాఫర్ పిలవడంతో ఆమె తో చిక్కొచ్చి పడింది. ఫోటోగ్రాఫర్ అప్పటికీ ఇంకా చిల్లింగ్ గానే ఉన్నాడు. తర్వాత పాలక్ ఒక్కసారిగా ప్రశాంతతను కోల్పోయింది. కోపం ప్రదర్శిస్తూనే వేగంగా పోజులిచ్చి అక్కడి నుంచి జంప్ అయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నిజానికి మొదటిసారి అతడి వ్యాఖ్యను పట్టించుకోకపోయినా, అతడు ఆ కామెంట్ ని రిపీట్ చేయడంతో పాలక్ స్పందించింది.
కోపంగా ఉన్న పాలక్ `హమేషా ఐసే క్యు బోల్తే హో ఆప్ లాగ్?` అని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పాలక్ మానసిక స్థితిని తేలికపరచడానికి మరొక ఫోటోగ్రాఫర్ మీ నెక్ట్స్ మూవీ భూత్నీ గురించి అడిగాడు. అవును రెడీ అవుతున్నాం! అంటూ పాలక్ తల ఊపింది. పాలక్ తదుపరి `భూత్నీ`లో కనిపిస్తుంది. ఇందులో సంజయ్ దత్, మౌని రాయ్, సన్నీ సింగ్, ఆసిఫ్ ఖాన్, బియోనిక్ కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 18న వెండితెరపైకి రానుంది. ట్రైలర్ ని మార్చి 30న థియేటర్లలో సల్మాన్ ఖాన్ సికందర్ తో జత చేస్తారని తెలుస్తోంది. పాలక్ టీవీ నటి శ్వేతా తివారీ కుమార్తె అన్న సంగతి తెలిసిందే.