Begin typing your search above and press return to search.

సోదరుడి స్పోర్ట్స్ విలేజ్ కుల్చివేత.. హైడ్రాపై పల్లంరాజు కీలక వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలో ఇటీవల మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత పల్లంరాజు సోదరుడి స్పోర్ట్ విలేజ్ ను కూలివేశారు. దీనిపై పల్లంరాజు సీరియస్ గా స్పందించారు!

By:  Tupaki Desk   |   31 Aug 2024 9:39 AM GMT
సోదరుడి స్పోర్ట్స్  విలేజ్  కుల్చివేత.. హైడ్రాపై పల్లంరాజు కీలక వ్యాఖ్యలు!
X

హైదరాబాద్ లో ఇప్పుడు హైడ్రా సందడి తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా వీకెండ్ వచ్చిందంటే.. అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి. గంటల వ్యవధిలో పని పూర్తి చేసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత పల్లంరాజు సోదరుడి స్పోర్ట్ విలేజ్ ను కూలివేశారు. దీనిపై పల్లంరాజు సీరియస్ గా స్పందించారు!

అవును.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పన్స్ అండ్ అసెంట్స్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా) అక్రమ కూల్చివేతలను కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... ఓ.ఆర్.ఓ. స్పోర్ట్స్ విలేజ్ ను హైడ్రా అధికారులు కూల్చివేశారు. హిమాయత్ సాగర్ బఫర్ జోన్ లో ఉన్న కారణంగా కూల్చివేసినట్లు చెబుతున్నారు. పదిరోజుల కిందటే ఈ కూల్చివేత ప్రక్రియ జరిగిపోయింది.

అయితే... తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు ట్విట్టర్ వేదికగా స్పందించడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ఎటువంటి ముందస్తు నోటీసులూ ఇవ్వకుండా కూల్చివేయడం బాధనిపించిందని అన్నారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ లు చేశారు.

ఇందులో భాగంగా... తన సోదరుడి స్పోర్ట్స్ వెంచర్ ను అక్రమ నిర్మాణం పేరుతో హైడ్రా ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేయడం బాధాకరమని.. ప్రజా జీవితంలో స్వచ్ఛమైన రికార్డును కలిగి ఉన్న తమపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధగా ఉందని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పల్లంరాజు.

ఇదే సమయంలో... తన సోదరుడు ఆనంద్ 7 ఎకరాల భూమి లీజుకు తీసుకొని స్పోర్ట్స్ వెంచర్ (ఓ.ఆర్.ఓ.) ఏర్పాటు చేశారని.. దీనికోసం తీసుకున్న అన్ని అనుమతులను పరిగణలోకి తీసుకోకుండా, కనీసం నోటీసు లేకుండా కూల్చివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ.ఆర్.ఓ. 2015 నుంచి పనిచేస్తుందని ఆయన తెలిపారు.

ఇలా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా హైడ్రా సడన్ గా వచ్చి కూల్చివేస్తుందంటూ స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేత కామెంట్ చేయడంతో మరోసారి ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై కాంగ్రెస్ సర్కార్ స్పందిస్తుందా లేదా అనేది వేచి చూడాలి!