Begin typing your search above and press return to search.

పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఎప్పుడో తెలుసా?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు అందరి ఫోకస్ పంచాయతీ ఎన్నికలపై పడింది. వీటిపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   13 Dec 2023 2:30 AM GMT
పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఎప్పుడో తెలుసా?
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు అందరి ఫోకస్ పంచాయతీ ఎన్నికలపై పడింది. వీటిపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. జనవరిలో నిర్వహిస్తారని ఒకవైపు మేలో జరిపిస్తారనే మరో వాదన వస్తోంది. ఈనేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కచ్చితమైన ఆదేశాలు మాత్రం రాలేదు. దీంతో ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై అందరికి అనుమానాలు వస్తున్నాయి.

ఎమ్మెల్యే ఎన్నికల్లోనే విచ్చలవిడిగా డబ్బులు పంచిన నేతలు స్థానిక ఎన్నికల్లో ఇబ్బడిముబ్బడిగా పంచుతారనే అనుకుంటున్నారు. డబ్బు, మద్యం ఏరులై పారే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. అందుకే ఖర్చు పెరుగుతుంది. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతుంటారు. ఎలాగైనా గెలవాలనే కసి అందరిలో ఉండటం సహజమే.

ఏప్రిల్ లో సార్వత్రిక ఎన్నికలు జరిపే సూచనలు కూడా ఉండటంతో వాటికంటే ముందే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారా? తరువాత జరిపిస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ప్రకారం పంచాయతీ ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే సందిగ్దత నెలకొంది.

రిజర్వేషన్ల విషయంలో కూడా ఇంకా స్పష్టమైన నిర్ణయాలు వెలువడలేదు. కొందరేమో గతంలో ఉన్న రిజర్వేషన్లే ఉంచుతారని చెబుతుంటే కొందరు మాత్రం రిజర్వేషన్లు మారుస్తారని అంటున్నారు. పంచాయతీ ఎన్నికలపై వస్తున్న ఊహాగానాలకు త్వరలోనే తెర పడుతుందని అనుకుంటున్నారు. ఎప్పుడు నిర్వహించినా ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు రెడీగానే ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో నగదు, మందు ప్రభావం చూపుతాయని స్పష్టంగా తెలుస్తోంది. దీని కోసం నిఘా కూడా పెంచాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. ఈ మేరకు చర్యలు తీసుకుని డబ్బు, మద్యం ప్రలోభాలకు ఓటర్లు గురికాకుండా చేయాలని చూస్తోంది. స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తప్పులు చోటుచేసుకోకుండా చేయాలని యోచిస్తోంది.