26 మంది హత్య... మృతదేహాలను మాయం చేసిన మొసళ్లు!
ప్రపంచ వ్యాప్తంగా నిత్యం ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటూ ఉంటాయి.
By: Tupaki Desk | 27 July 2024 12:30 AM GMTప్రపంచ వ్యాప్తంగా నిత్యం ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వీటివల్ల తెలుస్తున్న విషయాల్లో మనిషిలో మానవత్వం తాలూకు లక్షణాలు రోజు రోజుకీ పడిపోతున్నాయనేది ఒకటి అనే భావించాలి! కారణాలు ఏవైనా తాజాగా పపువా న్యుగినియాలో జరిన దారుణాలు ఈ భావనకు బలం చేకూరుస్తున్నాయి.
అవును... తాజాగా పపువా న్యూగినియాలో సాయుధ మూఖలు రెచ్చిపోతున్నాయి. ఇందులో భాగంగా దేశంలోని ఉత్తర ప్రాంతంలో మారుమూల ఉన్న మూడు గ్రామాల్లో దాడులు చేసి సుమారు 26 మందిని దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి, ఆ దేశ పోలీసు వర్గాలూ ఈ విషయాన్ని వెల్లడించాయి.
ఈ సందర్భంగా స్పందించిన ఆ దేశంలోని ఈస్ట్ సెపిక్ ప్రావిన్స్ పోలీస్ కమాండర్ జేమ్స్ బౌగెన్ మాట్లాడుతూ.. ఇది చాలా భయంకరమైన ఘటన అని, మృతుల్లో పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. సుమారు 30 మంది సాయుధులు వీరిపై ఈ ఊర్లపై విరుచుకుపడి హత్యలు చేసినట్లు వెల్లడించారు.
ఇదే సమయంలో... కొన్ని మృతదేహాలు కుళ్లిపోయే పరిస్థితికి వస్తే... మరికొన్నింటిని రాత్రి సమయాల్లో సమీప నదిలోని మొసళ్లు ఈడ్చుకు వెళ్లిపోయాయని పోలీస్ కమాండర్ బౌగెన్ తెలిపారు. ఇక ఉన్న మృతదేహాళ్లో చాలావాటికి తలలు లేవని తెలిపారు. ఇక మృతుల్లో చాలా మంది తల్లీపిల్లలేనని వెల్లడించారు.
ఇక ఈ మృతుల్లో 16 మంది వరకూ చిన్నారులు ఉన్నారని చెబుతుండంటం గమనార్హం! ఈ నేపథ్యంలోనే దుండగులు ఆ గ్రామాల్లోని పలు ఇళ్లను ధ్వంసం చేయడంతో.. చాలా మంది గ్రామస్థుల పోలీసుల రక్షణలో నివసిస్తున్నారు. సాధారణంగా ఇక్కడ భూవివాదాలే ఈ స్థాయి హత్యలకు కారణమవుతాయని అధికారులు చెబుతున్నారు.