Begin typing your search above and press return to search.

ఈ క్యూ అంతా పరోటాల కోసమా?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఏ మూల ఏమి జరిగినా ఇట్టే అరచేతిలో ప్రత్యక్షమైపోతుంది

By:  Tupaki Desk   |   23 July 2024 11:30 PM GMT
ఈ క్యూ అంతా పరోటాల కోసమా?
X

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఏ మూల ఏమి జరిగినా ఇట్టే అరచేతిలో ప్రత్యక్షమైపోతుంది. అయితే... అందులో పనికొచ్చేవి కొన్ని ఉంటే.. పనికి రానివి, పిల్లలను పాడు చేసేవి కాస్త ఎక్కువగా ఉంటాయని పలువురు అభిప్రాయపడుతుంటారు. ఆ సంగతి అలా ఉంటే... ఈ సోషల్ మీడియా పుణ్యమాని స్టార్లు గా మారిపోయిన వారూ లేకపోలేదు.

ప్రధానంగా ఈ సోషల్ మీడియా పుణ్యమాని వారూ వీరూ అనే తారతమ్యాలు ఏమీ లేకుండా అనుకున్నవాళ్లు అంతా గరిష్టంగా స్టార్లు అయిపోతున్నారు.. అది కూడా ఓవర్ నైట్ లో అనే కామెంట్లు అప్పుడప్పుడూ వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో రీల్స్ చేసి కొందరు.. తమకున్న డిఫరెంట్ స్కిల్స్ ని ప్రదర్శిస్తూ ఇంకొందరు.. డిఫరెంట్ ఫుడ్ ని పరిచయం చేస్తూ మరికొందరు నెట్టింట స్టార్స్ గా మారిపోతుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా చాలా మంది జనాలు ఓ పరోటాలు అమ్మే బండి ముందు గంటల తరబడి క్యూలో నిలబడి ఉన్నారు. అక్కడ వెరైటీ వెరైటీ పరోటాలు లభ్యమవుతాయని అంటున్నారు. ఇందులో భాగంగా... ఎగ్ పరోటా, బనానా పరోటా వంటి డిఫరెంట్ పరోటాలు అమ్ముతున్నారంట. నిజంగానే అందుకోసమే వీరంతా ఇలా క్యూ కట్టారా అని చూస్తే.. కథ వేరే ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

తాజాగా ‘పుయ్ రోటీ లేడీ’ అనే ఇన్ స్టా ఐడీలో షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారుతుంది. ఆ వీడియోలో ఓ అమ్మాయి రోడ్డు పక్కన బండివద్ద నిలబడి వెరైటీ వెరైటీ పరోటాలు చేసి అమ్ముతుంది. ఇదే సమయంలో తియ్యని జ్యూస్ కూడా విక్రయిస్తోందట. దీంతో... అక్కడ గంటల తరబడి జనాలు క్యూలో నిలబడి మరీ వెయిట్ చేస్తున్నారు. అలా అని వారంతా ఆ పరోటాల కోసం ఎదురుచూస్తున్నారని అనుకుంటే పొరపాటే!

ఆ పరోటాలు చేస్తున్న అమ్మాయి.. స్టైలిష్ లుక్ లో, బోల్డ్ డ్రెస్సింగ్ స్టైల్ లో, మెడకు కాస్త కింద టాటూలు ధరించి పరోటాలు చేస్తుంది. దీంతో.. అక్కడున్న జనాలు క్యూలో గంటలు తరబడి వెయిట్ చేస్తుంది పరోటాల కోసం కాదు.. పరువాల కోసం అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా... ప్రస్తుతం నెట్టింట ఈ పరోటాల పాప వీడియో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో... నెటిజన్లు క్రియేటివిటీకి పనిచెబుతూ కామెంట్లు చేస్తున్నారు!!