Begin typing your search above and press return to search.

సర్వే... పిల్లల విదేశీ విద్యలో భారతీయ తల్లితండ్రుల త్యాగం ఇదే!

నాల్గవ వంతు మంది సంపన్న భారతీయులు తమ పిల్లలను విద్య కోసం విదేశాలకు పంపారు లేదా పంపాలని ఆలోచిస్తున్నారన్ని తాజాగా ఓ సర్వే తెలిపింది.

By:  Tupaki Desk   |   3 Oct 2024 4:18 AM GMT
సర్వే... పిల్లల విదేశీ విద్యలో భారతీయ  తల్లితండ్రుల త్యాగం ఇదే!
X

నాల్గవ వంతు మంది సంపన్న భారతీయులు తమ పిల్లలను విద్య కోసం విదేశాలకు పంపారు లేదా పంపాలని ఆలోచిస్తున్నారన్ని తాజాగా ఓ సర్వే తెలిపింది. గ్లోబల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ - 2024 సర్వే ప్రకారం తమ పిల్లల విదేశీ విద్య కోసం భారతీయ తల్లితండ్రులు పలు త్యాగాలు చేస్తున్నారని తెలిపింది!

అవును... చాలా మంది సంపన్న భారతీయ తల్లితండ్రులు తమ పిల్లలకు విదేశీ విద్యను అందించడానికి గణనీయమైన ఆర్థిక త్యాగాలు చేస్తున్నారని.. చేయడానికి సిద్ధంగా ఉన్నారని సర్వే వెల్లడించింది. రూ.84 లక్షల నుంచి రూ.17 కోట్ల మధ్య పెట్టుబడి పెట్టదగిన మిగులు ఉన్న 1,456 మంది సంపన్న వ్యక్తులు పాల్గొన్న ఈ సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

ఇందులో భాగంగా ఆ 1,456 మంది సంపన్న భారతీయుల్లో 78% మంది తల్లితండ్రులు విదేశాల్లో చదువుతున్న పిల్లలను కలిగి ఉన్నారని.. లేదా, తమ పిల్లలను విదేశాలకు పంపాలని ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ సర్వే ప్రకారం.. భారతీయుల కోసం యూఎస్ అగ్ర విదేశీ గమ్యస్థానంగా ఉండగా తర్వాత స్థానంలో యూకే, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఉన్నాయి.

ఇలా పిల్లల విదేశీ విద్య కోసం తపన ఎంతో బలంగా ఉందని.. దీనికోసం తల్లితండ్రులు ఆర్థిక ఒత్తిళ్లను కూడా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నారని.. పదవీ విరమణ పొదుపును త్యాగం చేయడం ద్వారా విద్యపై పెట్టుబడి పెడుతున్నారని సర్వే పేర్కొంది! ఇదే సమయంలో 53% తల్లితండ్రులు తమ పిల్లల విద్యకోశం ప్రత్యేకంగా పొదులు ప్రణాళికను కలిగి ఉన్నారని చెబుతున్నారు.

విదేశాల్లో చదువుకోవడానికి అయ్యే ఖర్చు సగటున సుమారు $62,000 (సుమారు రూ.52.4 లక్షలు) ఖర్చు చేయాలని భావిస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో... పదవీ విరమణ పొదుపులో 3 సంవత్సరాల డిగ్రీ కోసం 48%, 4ఏళ్ల డిగ్రీకి 64% వరకూ పట్టోచ్చని చెబుతున్నారు. ఈ విషయంలో చాలా మంది తల్లితండ్రులు తమ ఆస్తులను విక్రయించాలని ఆలోచిస్తున్నారని సర్వే తెలిపింది!

ఇక 40% మంది తమ పిల్లలు విద్యార్థి రుణాలు తీసుకోవాలని, 51% మంది స్కాలర్ షిప్ ల కోసం చూస్తున్నారని చెబుతున్నారు. అయితే... పిల్లవాడు చదువుకోసం బయటకు వెళ్లినప్పుడు తల్లితండ్రులు ఆర్థికపరమైన ఆందోళనలతో పాటు మానసిక ఆందోళనలు, ఆరోగ్యపరమైన ఆందోళనలు వంటివి ఉంటున్నాయని సర్వే పేర్కొంది!