Begin typing your search above and press return to search.

కారు నడిపేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోవాలా?

అదేంటి హెల్మెట్ ధరించి కారు నడపడం ఏమిటనే సందేహం రావచ్చు.

By:  Tupaki Desk   |   16 May 2024 12:30 PM GMT
కారు నడిపేటప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోవాలా?
X

కొన్ని సార్లు కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. మనం సాధారణంగా ద్విచక్ర వాహనం నడుపుతుంటే హెల్మెట్ పెట్టుకోవడం చూస్తుంటాం. కానీ అతడు కారు నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం చూసి పోలీసులే షాక్ అయ్యారు. అదేంటి హెల్మెట్ ధరించి కారు నడపడం ఏమిటనే సందేహం రావచ్చు. కానీ ఇది ముమ్మాటికి నిజం. ఉత్తరప్రదేశ్ లో జరిగిన సంఘటన ఇది.

యూపీలోని ఝాన్సీకి చెందిన చెందిన బహదూర్ సింగ్ పరిహార్ ప్రతి రోజు హెల్మెట్ పెట్టుకుని కారు నడుపుతున్నాడు. రెండు నెలల క్రితం హెల్మెట్ పెట్టుకోకుండా కారు నడిపాడనే కారణంతో అక్కడి ట్రాఫిక్ పోలీసులు అతడికి రూ.1000 జరిమానా విధించారు. ఫైన్ ఎందుకు వేశారంటూ అడిగితే ఎన్నికలయ్యాక చూద్దాం అని సమాధానం దాట వేశారట.

అప్పటి నుంచి హెల్మెట్ లేకపోతే జరిమానా కట్టాల్సి వస్తుందని అతడు హెల్మెట్ పెట్టుకునే కారు నడుపుతున్నాడట. ఇది కొంచెం విచిత్రమే అయినా నమ్మక తప్పదు. అక్కడి పోలీసుల తీరుకు అందరు ఆశ్చర్యపోతున్నారు. బైక్ ల మీద వెళ్లే వారు హెల్మెట్ పెట్టుకుంటారు కానీ కారు నడిపే వారు కూడా హెల్మెట్ వాడాలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

బహదూర్ సింగ్ లో ఫైన్ భయం పట్టుకుంది. హెల్మెట్ లేకపోతే అనవసరంగా జరిమానా కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఎటు వెళ్లినా శిరస్త్రాణం ధరించే వెళ్తున్నాడు. యూపీ ట్రాఫిక్ పోలీసుల తీరుతో అతడు హెల్మెట్ ను ఆయుధంగా చేసుకుంటున్నాడు. ఎక్కడకెళ్లినా హెల్మెట్ లేకుండా వెళ్లడం లేదు. బైక్ నడిపే వారు తీసుకునే జాగ్రత్తలు కారు డ్రైవింగ్ చేసే వారు కూడా తీసుకోవాలేమో?

యూపీలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అక్కడ చట్టాలు కూడా ప్రత్యేకంగా ఉండటం వల్ల హెల్మెట్ వాడకం తప్పనిసరి అయిందేమో అనుకుంటున్నారు. ఏది ఏమైనా హెల్మెట్ తో కారు నడపడం నిజంగా ఓ కొత్త అనుభూతే అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.