వైసీపీని ఉలిక్కిపడేలా చేసిన పరిటాల ఫ్యామిలీ !
ఇక సీబీఐ విచారణలో జగన్ కి క్లీన్ చీట్ ఇచ్చారు. అయితే పరిటాల హత్య కేసులో సూత్రధారులు పాత్రధారులు అంటూ కొన్ని పేర్లు వచ్చాయి.
By: Tupaki Desk | 4 April 2025 2:15 PMరాయలసీమలో కక్షలు కార్పణ్యాలు అన్నవి ఉండేవి. ఇది నిజం. కానీ అదంతా ఒకప్పుడు. ఇక చూస్తే కనుక డెబ్బది దశకం నుంచి మొదలైన ఫ్రాక్షన్ స్టోరీసులు దానిని అల్లుకుని గొలుసు కట్టు హత్యలు ఇవన్నీ కూడా 2000 ప్రధమార్ధం వచేసరికి డెడ్ ఎండ్ కి వచ్చేశాయి. ఇక పరిటాల హత్య కేసులో సూత్రధారి అన్న నింద మోసిన సూరి హత్యతో ఇవనీ క్లోజ్ అయ్యాయని చెబుతారు.
ఆయన హత్య జరిగి కూడా దశాబ్దరన్నర కాలం అయింది. ఇక ఒకనాటి మావోల ఉద్యమం ఇపుడు అంతలా లేదు. అంతే కాదు సీమ ప్రాంతాలలో కూడా ఫ్రాక్షన్ కధలు అయితే వినిపించడం లేదు ఎన్నికలు జరిగినా ఒకింత ఉద్రిక్తతలు తప్పించి రక్తపాతాలు అయితే నమోదు కావడం లేదు. దానికి వైఎస్సార్ చంద్రబాబులను అభినందించాలి. సీమ నుంచి వచ్చిన ఈ ఇద్దరూ ముఖ్యమంత్రులుగా వీటి విషయంలో గట్టిగానే పనిచేశారు.
ఆ తరువాత వచ్చిన వారు అదే వరసలో వ్యవహరించారు. ఇవన్నీ పక్కన పెడితే 2004 మేలో వైఎస్సార్ సీఎం అయ్యాక గట్టిగా ఏడెనిమిది నెలలు కూడా కాలేదు, 2005 జనవరి 25న అప్పటి విపక్ష టీడీపీలో ప్రముఖ నాయకుడు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర దారుణ హత్యకు గురి అయ్యారు. అప్పట్లో ఇది భారీ ప్రకంపనలు రేపింది.
ఒక విధంగా చెప్పాలీ అంటే కోస్తాలో వంగవీటి రంగా హత్య తరువాత అంత కాకపోయినా ఒక లెవెల్ లో సీమ ప్రాంతంలో అయితే అలజడి రేపింది. దీని మీద నాటి టీడీపీ పట్టుబట్టిన మీదట సీబీఐ విచారణకు వైఎస్సార్ సర్కార్ ఆదేశించింది. జగన్ మీద కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. జగన్ అన్న పేరు కూడా ఉమ్మడి ఏపీ ప్రజలకు తొలిసారి అలా తెలిసింది.
ఇక సీబీఐ విచారణలో జగన్ కి క్లీన్ చీట్ ఇచ్చారు. అయితే పరిటాల హత్య కేసులో సూత్రధారులు పాత్రధారులు అంటూ కొన్ని పేర్లు వచ్చాయి. వారికి శిక్షలు పడ్డాయి. ఆ తరువాత ప్రధాన సూత్రధారి అని ఆరోపణలు మోపబడిన మద్దెలచెరువు సూరిని కూడా ప్రత్యర్ధులు హత్య చేశారు. ఈ మీదట చూస్తే ఫ్రాక్షన్ గొడవలు అయితే సద్దుమణిగాయి.
పరిటాల ఫ్యామిలీ నుంచి రవీంద్ర సతీమణి రాజకీయాల్లోకి వచ్చి మంత్రి అయ్యారు. ఇపుడు ఆమె మరోసారి రాప్తాడులో గెలిచారు. వారసుడిగా పరిటాల శ్రీరామ్ ఉన్నారు. రాయలసీమలో పరిటాలకు రాజకీయంగా ఎదురు నిలిచిన జేసీ ఫ్యామిలీ టీడీపీలో చేరింది. అంతా కలసిమెలసి ఉంటున్నారు. వైసీపీ వర్సెస్ టీడీపీగా పాలిటిక్స్ సాగుతూ మూడు ఎన్నికలు చూసినా కూడా ఎక్కడా ఫ్యాక్షనిజం అన్న మాట అయితే లేదు.
కానీ ఉన్నట్లుండి ఇపుడు సడెన్ గా మాజీ మంత్రి సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే అయిన పరిటాల సునీత తన భర్త పరిటాల రవీంద్ర హత్యలో జగన్ ప్రమేయం ఉందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవి ఇపుడు వైరల్ గా మారాయి. పాత్రధారులకు జగన్ ప్రోద్బలం ఉందని ఆమె ఘాటైన విమర్శలే చేశారు. సీమలో పచ్చని ప్రాంతంగా ప్రశాంతంగా ఉన్న నేలలో మళ్ళీ ఫ్యాక్షన్ రాజకీయం తీసుకుని రావద్దు అని ఆమె జగన్ ని కోరడం విశేషం.
ఆమె చేసిన ఈ ఆరోపణలు అయితే రాజకీయంగా చేసినవే అని అంటున్నారు ఎందుకంటే స్థానిక వైసీపీ నేతలు పరిటాల సునీత మీద చేసిన ఆరోపణలు ఫ్రాక్షనిజాన్ని పరిటాల ఫ్యామిలీ తెచ్చింది అని వారు చేసిన వాటికి ప్రతిగానే ఆమె చేసారు అని అంటున్నారు. కానీ ఏపీకి అయిదేళ్ళ పాటు సీఎం గా చేసిన వ్యక్తి మీద ఈ తరహా ఆరోపణలు రావడం అంది కూడా రెండు దశాబ్దాల తర్వాత రావడం మీద వైసీపీలో చర్చ సాగుతోంది.
పరిటాల రవీంద్రకు సీఎమలో చాలా చోట్ల మంచి అనుచరులు ఉన్నారు. అభిమాన గణం ఉంది. ఈ తరానికి ఆయన గురించి ఎంతో కొంత తెలుసు. కానీ ఆయన హత్య వెనక జగన్ ఉన్నారని స్వయంగా సతీమణి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇపుడు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సీమలో వైసీపీకి మంచి పట్టు ఉంది. ఆమె చేసిన ఈ ఆరోపణల వల్ల వైసీపీకి రాజకీయంగా ఇబ్బంది కలిగే వీలుందని అంటున్నారు. అంతే కాదు రవి అభిమానులకు కొత్త తరానికి జగన్ ని ముందు పెట్టి ప్రత్యర్థిగా చూపించాలన్న వ్యూహం ఉందని అంటున్నారు.
అయితే దీని మీద వైసీపీ కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. ఎపుడో ఇరవై ఏళ్ళ క్రితం పరిటాల రవీంద్ర హత్య జరిగింది. ఇపుడు ఫ్రెష్ గా జగన్ మీద ఆరోపణలు చేయడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యలో టీడీపీ కూడా పాలించింది కదా సునీత మంత్రిగా కూడా ఉన్నారు కదా మరి ఎందుకు ఈ హత్య విషయంలో జగన్ ప్రమేయాన్ని వెలికి తీయలేకపోయారు అని ప్రశ్నిస్తున్నారు.
జగన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికే ఈ ఆరోపణలు అని అంటున్నారు. ఏది ఏమైనా మరణించి సీమ జనం గుండెలలో దేవుడిగా ఉన్న పరిటాల రవీంద్ర హత్యలో జగన్ ప్రమేయం ఉందని సునీత ఆరోపించడం వైసీపీకి కొంత ఇబ్బందిగానే ఉంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీకి సీమలో చెక్ పెట్టే ప్లాన్స్ లో ఇదొకటి అని కూడా అంటున్నారు.