అయిదేళ్ళూ అంటున్న మోడీ...విపక్షాలకు డెడ్ లైన్ !
ఎక్కడైనా గెలిచినా వారు సంబరాలు చేసుకుంటారు. ఓడినా అహంకారమా అని రాహుల్ మీద కౌంటర్లు పేల్చేఅరు.
By: Tupaki Desk | 23 July 2024 2:30 AM GMTకేంద్రంలో మూడవసారి గద్దెనెక్కినా ఆ జోష్ హుషార్ మూడ్ అయితే ఎన్డీయే కూటమి అగ్ర నేతలలో లేనే లేదు అదే సమయంలో ఇండియా కూటమి మాత్రం ఫుల్ ఫైర్ తో ఉంది. దాన్ని చూసిన కేంద్ర మంత్రి అమిత్ షా ఓడిన వారికి ఇంత ఆనందం ఏమిటి అని సెటైర్లు వేస్తున్నారు. ఎక్కడైనా గెలిచినా వారు సంబరాలు చేసుకుంటారు. ఓడినా అహంకారమా అని రాహుల్ మీద కౌంటర్లు పేల్చేఅరు.
అయితే రాహుల్ నుంచి మమతా అఖిలేష్ ఇలా విపక్ష నేతలు అంతా మోడీ ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని చెబుతున్నారు. మధ్యలోనే కుప్ప కూలుతుందని అది ఎపుడో చెప్పలేమని కూడా అంటున్నారు. ఈ రకమైన విమర్శలు జోస్యాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ అయితే విపక్షానికి ధీటైన బదులు ఇచ్చినట్లుగా కనిపించారు.
పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ప్రారంభం సందర్భంగా ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ అయిదేళ్ళూ ఎన్డీయే ప్రభుత్వం ఉంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రానున్న అయిదేళ్ళ కాలానికి ఒక రోడ్ మ్యాప్ అని కూడా ఆయన చెప్పారు.
ఈ బడ్జెట్ రాబోయే అయిదేళ్ళకు సంబంధించి తమ పదవీ కాలానికి దశ దిశను నిర్ణయిస్తుందని కూడా పేర్కొన్నారు. కొన్ని పార్టీలు ప్రతికూల రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఇండియా కూటమిని నిశితంగా విమర్శించారు. ఎన్నికల సీజన్ ముగిసింది. ప్రజలు ఎన్డీయే కూటమికి అయిదేళ్ల పాటు తీర్పు ఇచ్చారని అందువల్ల దానికి గౌరవిస్తూ ప్రజా సమస్యలను లేవనెత్తాలని ఆయన ఎంపీలను కోరడం విశేషం.
విపక్షాల రాజకీయానికి 2029 జనవరి దాకా డెడ్ లైన్ విధించారు మోడీ. అప్పటిదాకా ప్రజా సమస్యలే పార్లమెంట్ లో ప్రస్తావనకు రావాలని రాజకీయాలకు అతీతంగా అంతా దేశ అభివృద్ధి కోసం పాటు పడాలని ఆయన కోరారు.
మొత్తంగా చూస్తే ప్రధాని మోడీ ఎన్నికల ఏడాది అయిన 2029 జనవరిలోనే రాజకీయాల గురించి మాట్లాడాలని కోరారని అంటున్నారు. అంతవరకూ తమ ప్రభుత్వమే ఉంటుందని చెప్పకనే చెప్పారని అంటున్నారు. ఒక విధంగా అయిదేళ్ళ ప్రభుత్వం తమదని విపక్షాలతో పాటు ప్రజలకు ఆయన ఒక సందేశం పంపించారు అని అంటున్నారు
కేంద్రంలో మెజారిటీలు చూస్తే కనుక ఇండియా కూటమి బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా ఉన్నాయి. దాంతోనే ప్రభుత్వ సుస్థిరత మీద విపక్షాలలో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది కాస్తా జనంలోకి వెళ్తే ప్రభుత్వానికి సైతం మంచిది కాదు అని అంటున్నారు. అందుకే మొగ్గలోనే తుంచేయాలని అనుకున్నారో లేక విపక్షం అంచనాలు తప్పు అని రాజకీయంగా ధాటీగా సూటిగా బదులు ఇవ్వాలనుకున్నారో ఏమో కానీ మోడీ అయిదేళ్ల ప్రభుత్వం మాది అని అంటున్నారు.
రాజకీయ విమర్శలకు 2029 మాత్రమే సీజన్ అని ఆయన ఒక టైం కూడా సెట్ చేసి పెట్టారు. తమ ప్రభుత్వం సుస్థిరమైనది అని ఆయన ధీమాగా చెబుతున్నారు. ఇక బీజేపీ తీరు చూసినా మోడీ అమిత్ షాల సారధ్యం చూసినా నడి మధ్యలో అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండరని కూడా అంటారు.
అంతే కాదు ఈ టెర్మ్ బీజేపీకి చాలా కీలకం కూడా. ప్రజల మూడ్ చూస్తే క్రమంగా మార్పు కనిపిస్తోంది. దాంతో ఈ టెర్మ్ లో పూర్తి కాలం ఉండడమే బీజేపీ చేసే పని అని అంటున్నారు. మరోసారి ప్రజల వద్దకు తీర్పుకు వెళ్తే ఇబ్బందులు తప్పవని కూడా ఢక్కామెక్కీలు తిన్న బీజేపీ పెద్దలకు అర్ధం కాని విషయం కాదనే అంటున్నారు.
ఏది ఏమైనా ఈ అయిదేళ్లూ మీకు నో చాన్స్ అని విపక్షానికి కచ్చితంగా మోడీ చెప్పారని అంటున్నారు. అయితే ఇపుడు సమ ఉజ్జీలుగా ఎన్డీయే ఇండియా కూటమికి ఉన్నాయి. ఎదురు బొదురుగా నిలిచిన ఈ రాజకీయ సంగ్రామంలో ఎవరి చాన్స్ వారు తీసుకుంటాయి. ఇందులో కలసివచ్చే ఏ ఒక్క దానినీ అసలు వదులుకోవు.
అయితే అధికారంలో ఉన్న కూటమిగా ఎన్డీయేకు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అన్నది వాస్తవం అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే అపశకునాలకు విపక్షాల రాజకీయ జోస్యాలకు మోడీ తనదైన శైలిలో బదులిచ్చారు అని అంటున్నారు. మరి ఇకనైనా విపక్షాలు మోడీ మాట మేరకు జోస్యాలు విరమించుకుంటాయా లేక తుమ్మితే ఊడే ముక్కు లాంటి ప్రభుత్వం అని రాజకీయ ఆట అడుతూనే ఉంటాయా అన్నది చూడాల్సి ఉంది.