ఎవడి గోల వాడితే.. 'ఈవీవీ'ని గుర్తు చేయడం ఖాయమేనా?! ఇంట్రస్టింగ్ ఇష్యూ
తాజాగా దేశ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. గురువారం నుంచి ప్రారంభమయ్యే రెండు సభలు(లోక్-రాజ్యసభలు) ఈ నెల చివరి వరకు జరుగుతాయని తెలిపారు.
By: Tupaki Desk | 18 July 2023 5:50 AM GMTదివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ గుర్తున్నారు కదా.. ఆయన తీసే సినిమాల కు డిఫరెంట్ టైటిల్స్ పెడుతుంటారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఆయన ఈ టైటిల్స్ ఎంచుకుంటారు. కథను కూడా అలానే రాసుకుంటారు. సరే.. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు? అనే డౌట్ వస్తుంది. తాజాగా దేశ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. గురువారం నుంచి ప్రారంభమయ్యే రెండు సభలు(లోక్-రాజ్యసభలు) ఈ నెల చివరి వరకు జరుగుతాయని తెలిపారు.
అయితే.. ఈ సభలో అధికార, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లు ఇప్పటికే.. ఒక క్లారిటీతో ఉన్నాయి. సో.. వాటి విషయం పక్కన పెడితే.. పార్లమెంటు లో ఇప్పుడు ప్రాంతీయ పార్టీల కు కూడా బలం పెరిగింది. దీంతో ఆయా పార్టీల గళం కూడా పార్లమెంటులో బలం గానే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల పై ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు. జాతీయ పార్టీలు ఎలానూ.. క్షేత్రస్తాయి లో సమస్యల పై స్పందించే అవకాశం లేదని ప్రజలు డిసైడ్ అయ్యారు. అందుకే ప్రాంతీయ పార్టీల కు పట్టంకడుతున్నాయి.
ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలైనా.. నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక సమస్యలు, ఉపాధి లేమి.. పెట్రోల్, డిజిల్ ధరలు, ముఖ్యంగా వంటగ్యాస్ ధరల ను పార్లమెంటు లో ప్రస్తావిస్తాయని భావిస్తున్నారు. కానీ, వీరు అనుకోవడంలో తప్పులేకపోయినా.. ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఇప్పుడు ప్రజల నాడిని పట్టుకునే పరిస్థితిలో లేవు. ఎందుకంటే.. ఏ పార్టీకి ఆపార్టీకి సొంతగా అనేక కష్టాలు ఉన్నాయి. దీంతో ఎవరి గోల వారిదే అన్నట్టుగా పార్లమెంటు మోడీ పై యుద్ధం చేసేందుకు రెడీ అవుతున్నాయి.
మచ్చుకు కొన్ని రాష్ట్రాలు.. పార్టీల ను తీసుకుంటే పార్లమెంటులో ఏం చేయనున్నాయంటే..
ఏపీ
వైసీపీ: మరిన్ని అప్పులు ఇప్పించేలా పార్లమెంటు లో ఒత్తిడి చేయడం.
టీడీపీ: రాష్ట్రంలో వైసీపీ అక్రమాలను పార్లమెంటు వేదికగా ఎలుగెత్తడం.
తెలంగాణ
బీఆర్ ఎస్: మోడీ సర్కారు కక్ష సాధింపు రాజకీయాలు, నిధులు, కవిత కేంద్రంగా రాజకీయాలు
బీజేపీ : కేసీఆర్ అక్రమాలు, అధికార పార్టీ అవినీతి
తమిళనాడు
డీఎంకే: ఈడీ దాడులు.. గవర్నర్ రవి వ్యవహారం
అన్నా డీఎంకే: స్టాలిన్ అక్రమాలు.. రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యం(కేంద్రం లో కాదు.. రాష్ట్రం లో)
పశ్చిమ బెంగాల్
తృణమూల్ కాంగ్రెస్: బీజేపీ అక్రమాలు.. పార్టీని చీల్చే కుట్రలపై పార్లమెంటు లో లేవనెత్తడం.
బీజేపీ(రాష్ట్ర): ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో తృణమూల్ విధ్వంసం.. బీజేపీ కార్యకర్త హత్య
బిహార్
జేడీయూ: మోడీ అక్రమాలు.. రాష్ట్రం లో ఈడీ దాడులు
బీజేపీ: నితీష్ అక్రమాలు.. ప్రభుత్వం వ్యవహారం
ఢిల్లీ
ఆప్: గవర్నర్ దూకుడు, ఉద్యోగుల విషయం లో కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్, లిక్కర్ కుంభకోణం, ఈడీ కేసులు
బీజేపీ: సీఎం కేజ్రీవాల్ చేతకాని తనం.. వరదలు వచ్చినా పట్టని వ్యవహారం
కట్ చేస్తే: దాదాపు అన్ని రాష్ట్రాలదీ ఇదే పరిస్థితి. పార్లమెంటు తలుపు తెరవడమే ఆలస్యం.. కొట్టుకునేందుకు కత్తుల వంటి మాటల తో రెడీగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి.. మరి ప్రజల సమస్యలు.. నిత్యావసరాల ధరలు.. వంటివాటి పై చర్చించేందుకు ఎవరికి సమయం ఉంది?! అందుకే.. ఈవీవీ గుర్తుకు వస్తున్నారు. ఎవడి గోలవాడిదే!! కాదంటారా?!