Begin typing your search above and press return to search.

పార్లమెంటులో పొగగొట్టాలు... ఆ నలుగిరిలో ఇద్దరు వీరే!

భారత పార్లమెంట్ లో ఊహించని సంఘటన జరిగింది. సుమారు 22 ఏళ్ల తర్వత దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడే సంఘటన తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 9:59 AM GMT
పార్లమెంటులో పొగగొట్టాలు... ఆ నలుగిరిలో ఇద్దరు వీరే!
X

భారత పార్లమెంట్ లో ఊహించని సంఘటన జరిగింది. సుమారు 22 ఏళ్ల తర్వత దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడే సంఘటన తెరపైకి వచ్చింది. దీంతో గతాన్ని తలచుకోవడం ఒకెత్తు అయితే.. అసలు ఈ ఘటన వెనక ఉన్నది ఎవరు.. స్వదేశీయులా.. విదేశీయులా అనే చర్చ తెరపైకి వచ్చింది ఈ సమయంలో అసలు ఎందుకు వారు ఈ దారుణానికి పాల్పడ్డారు అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో కొత్త పార్లమెంట్ భద్రతపై కాంగ్రెస్ నుంచి (రాజకీయ) విమర్శలు తెరపైకి వచ్చాయి.

అవును... లోక్‌ సభలో కొందరు దుండగులు పార్లమెంట్ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారు. పైగా ఈ రోజు డిశెంబర్ 13 కావడంతో ఈ విషయం మరింత ఆందోళన కలిగించింది. దీంతో... దేశవ్యాప్తంగా ఈ విషయం సంచలనం రేపుతోంది. వాస్తవానికి తాజా పార్లమెంట్ లో సభ జరుగుతోన్న సమయంలోనే ఓ వ్యక్తి బెంచీలపై ఎగురుతూ నినాదాలు చేయగా.. మరోవ్యక్తి తెలియని ఒక రకం పొగను వదలడం ఆందోళన కలిగిస్తోంది.

ఇదే సమయంలో పార్లమెంటు బయట మరో ఇద్దరు దుండగులు ఈ తరహాలోనే ఆందోళనలు చేశారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అటు సభ జరుగుతున్న సమయంలో లోపల ఇద్దరు అల్లకల్లోలం సృష్టిస్తున్నారని తెలుస్తుండగా.. పార్లమెంటు బయట ఇద్దరు వ్యక్తులు నిరసనకు దిగారు. పైగా నిరసన చేసిన ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక మహిళ కూడా ఉన్నారు.

దీంతో అసలు ఏంఇ జరుగుతుందనే చర్చ మొదలింది. ప్రధానంగా రంగుల పొగను వెదజల్లుతూ ఆందోళనకు దిగిన ఈ ఇద్దరినీ ట్రాన్స్‌ పోర్టు భవనం ముందు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరిలో ఒకరైన ఆ మహిళ పేరు నీలం (42) కాగా మరో వ్యక్తి అమోల్‌ శిందే (25)గా గుర్తించారు. వీరెందుకు ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారనే విషయంపై పూర్తి దర్యాప్తు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు

ఇదే సమయంలో సభ జరుగుతున్న సమయంలో... గందరగోళం సృష్టించిన ఇద్దరు వ్యక్తులు ఎవరనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఊహించని విధంగా ఓ ఎంపీ సిఫార్సుతోనే వారిద్దరు లోనికి చేరినట్లు కథనాలు వస్తున్నాయి. దీంతో ఆయన ఎవరు, ఏ పార్టీకి చెందిన వారు అనే చర్చ తదనుగుణంగా మొదలైంది. అయితే, కట్టుదిట్టమైన భద్రతావ్యవస్థ ఉన్నప్పటికీ వాయువును వెదజల్లే గొట్టాలను లోనికి ఎలా తీసుకెళ్లారనే విషయం ప్రస్తుతానికి మిస్టరీగా మారింది.

మీడియా ప్రశ్నించిందనో.. విపక్షాలు విమర్శించాయనో కాదు కానీ... అసలు ఇద్దరు వ్యక్తులు పార్లమెంట్ భవనంలో సభ్యులు చర్చిస్తున వేళ ఎంటరవ్వడం చిన్న విషయం కాదని.. దీనివల్ల ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడిందని.. ఇది భద్రతా లోపానికి నిలువెత్తు నిదర్శనమనే కామెంట్లు వినిపిస్తున్నాయి.