Begin typing your search above and press return to search.

జగన్ దమ్ముకు పరీక్ష పెట్టిన మంత్రి తెరపైకి కీలక సవాల్!

దీనికి తోడు.. ఆరోగ్యశ్రీ ఎత్తేస్తున్నట్లేనా అనే అనుమానాలు కలుగుతున్నాయంటూ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించడంతో వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   31 July 2024 5:04 PM GMT
జగన్  దమ్ముకు పరీక్ష పెట్టిన మంత్రి తెరపైకి కీలక సవాల్!
X

ఆంధ్రప్రదేశ్ లో గత రెండు మూడు రోజులుగా ఆరోగ్యశ్రీ పథకం గురించిన చర్చ తీవ్ర స్థాయిలో నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా కేంద్రమంత్రి, గుంటూరు టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు జనాల్లో వైరల్ గా మారాయి. దీనికి తోడు.. ఆరోగ్యశ్రీ ఎత్తేస్తున్నట్లేనా అనే అనుమానాలు కలుగుతున్నాయంటూ ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల స్పందించడంతో వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది.

ఈ సమయంలో స్పందించిన కేంద్రమంత్రి పెమ్మసాని... ఆరోగ్యశ్రీకి, ఆయుష్మాన్ భారత్ కొనసాగింపే తప్ప మరొకటి కాదన్నట్లుగా వివరణ ఇచ్చారు! మరోపక్క... రూ.5 లక్షల లిమిట్ ఉన్న ఆయుష్మాన్ భారత్.. రూ.25 లక్షల లిమిట్ ఉన్న ఆరోగ్యశ్రీ అంతర్భాగమే అని వైసీపీ చెప్పడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గామారింది. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పార్థసారథి స్పందించారు.. జగన్ కు సవాల్ విసిరారు!

అవును... ప్రస్తుతం ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం ఉంచుతారా.. తుంచుతారా అనే విషయంపై తీవ్ర చర్చలు జరుగుతున్న వేళ ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు. ఇందులో భాగంగా.. గత ప్రభుత్వం చేతగానితనం వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆక్షేపించారు. బిల్లులు చెల్లించకపోవడంతోనే నాడు చాలా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని నిలిపివేశాయని గుర్తు చేసుకున్నారు!

ఇదే క్రమంలో... “పేదలకు వైద్యం అందకుండా చేసిన చేతగాని పాలన జగన్ ది” అని కొలుసు పార్థసారథి విమర్శించడం గమనార్హం! ఇదే క్రమంలో... కొన్ని గ్లోబెల్స్ పత్రికలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని, అలాంటి వాటిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే జగన్ కు ధమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి!

ఈ సందర్భంగా కూటమిపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పిన పార్థసారథి... సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, పీఎం మోడీ.. ఈ రాష్ట్రాభివృద్ధికి, ప్రజల ఆరోగ్యానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కోటిమందికి ఆరోగ్యశ్రీ పథకం అమలుచేస్తామని తెలిపారు.